Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 67604
            [news_title_telugu_html] => 

33శాతం వృద్ధితో దూసుకెళ్లిన బీమారంగం

[news_title_telugu] => 33శాతం వృద్ధితో దూసుకెళ్లిన బీమారంగం [news_title_english] => Life insurers register 33 pc growth in new premium income at Rs 18209 cr in Feb [news_short_description] => దేశీయ బీమా రంగం ఈ ఏడాది ఫిబ్రవరిలో 32.7 శాతం వృద్ధి నమోదు చేసిందని, ప్రీమియం చెల్లింపులు రూ. 18,209 కోట్లకు చేరాయని ఇన్‌ష్యురెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా... [news_tags_keywords] => Insurance Sector,India,Growth [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-15 00:45:55 [news_isactive] => 1 [news_status] => 2 ) )
33శాతం వృద్ధితో దూసుకెళ్లిన బీమారంగం - Life insurers register 33 pc growth in new premium income at Rs 18209 cr in Feb - EENADU
close

తాజా వార్తలు

33శాతం వృద్ధితో దూసుకెళ్లిన బీమారంగం

ఏప్రిల్‌ -ఫిబ్రవరి (2018-19)లో రూ. 1,77,213.57 కోట్లకు చేరిన ఆదాయం

దిల్లీ: దేశీయ బీమా రంగం ఈ ఏడాది ఫిబ్రవరిలో 32.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ప్రీమియం చెల్లింపులు రూ. 18,209 కోట్లకు చేరాయని ఇన్స్యూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ) నివేదికలో వెల్లడైంది. గత ఏడాది ఇదే నెలలో ప్రీమియం చెల్లింపులు రూ. 13,724.96 కోట్లుగా ఉన్నాయి. దేశీయంగా మార్కెట్‌లో 66.26 శాతం వాటా ఉన్న అతి పెద్ద బీమా సంస్థ అయిన లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) 42.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రీమియం చెల్లింపులు రూ. 12,055.81 కోట్లకు చేరినట్లు ఐఆర్‌డీఏఐ నివేదికలో తేలింది. ఎల్‌ఐసీ తర్వాత మార్కెట్‌లో 33.74 శాతం వాటాతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో 23 దేశీయ బీమా రంగ సంస్థలు 17.25 శాతం వృద్ధితో రూ. 6,153.70 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. 
ప్రైవేటు సెక్టార్‌లోని బీమా సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్‌ 49 శాతం (రూ. 1,055.32 కోట్లు), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ 33.1 శాతం (రూ. 1,039.14 కోట్లు), ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ 21.6 శాతం(రూ. 222.26 కోట్లు), మ్యాక్స్‌ లైఫ్‌ 23.7 శాతం (రూ. 529.77 కోట్లు), కోటక్‌ మహీంద్ర లైఫ్‌ 15.25 శాతం(రూ. 403.01 కోట్లు) వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాదితో పోలిస్తే సగటున 15.25 శాతం మేర ఆదాయం పెరిగింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రామెరికా లైఫ్‌, భారతీ యాక్సా లైఫ్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. మొత్తంగా ఏప్రిల్‌ -ఫిబ్రవరి (2018-19) ఆర్థిక సంవత్సరంలో 24 బీమారంగ సంస్థలు 7.60 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 1,77,213.57 కోట్లను ప్రీమియం చెల్లింపుల రూపంలో ఆర్జించాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.