close

తాజా వార్తలు

విశాఖ నుంచి 4 విమానాలు రద్దు

విశాఖపట్నం: ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ నుంచి శనివారం బయలుదేరాల్సిన విమానాలు రద్దయ్యాయి. విశాఖ నుంచి బెంగళూరు, దుబాయ్‌, హైదరాబాద్‌, దిల్లీ వెళ్లాల్సిన 4 విమానాలను ఆయా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. దీంతో ప్రయాణికులు వెనుదిరిగారు. మరోవైపు విశాఖపట్నం వెళ్లాల్సిన రెండు విమానాలను దారిమళ్లించారు. చెన్నై- విశాఖ విమానాన్ని భువనేశ్వర్‌లో ల్యాండింగ్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి విశాఖ వస్తున్న ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. ఆ విమానంలో ఎంపీ హరిబాబుతో పాటు పలువురు వ్యాపారవేత్తలు ఉన్నట్లు సమాచారం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.