close

తాజా వార్తలు

‘జెట్‌’ మూసివేత ఓ కుంభకోణం

కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ

పణజీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ మూసివేత కుంభకోణంలా కనిపిస్తోందని కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ అభిప్రాయపడ్డారు. పాలకవర్గానికి సన్నిహితంగా ఉండేవారికి దీన్ని కట్టబెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎవరూ దృష్టి సారించలేరన్న ఉద్దేశంతోనే ఈ మొత్తం ప్రక్రియకు ఎన్నికల సమయాన్ని ఎంచుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని, కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఎక్కువసీట్లువస్తే రాహుల్‌ గాంధీయే ప్రధాని అవుతారని శర్మ చెప్పారు. పార్టీలు సాధించే సీట్లు ఆధారంగా ఎన్నికల అనంతరం పొత్తులుంటాయన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.