close

తాజా వార్తలు

ఒక్కజోక్‌ వల్ల విమానం 16గంటలు ఆగింది

 

 బెంగళూరు: సాధారణంగా వాతావరణం అనుకూలించకనో లేదా.. ఏదైనా సాంకేతిక లోపాలు తలెత్తడం వల్లనో విమానాలు గంటలకు గంటలు ఆలస్యం కావడం మనం వింటూనే ఉంటాం. కానీ బెంగళూరు నుంచి సింగపూర్‌ వెళ్లాల్సిన విమానం మాత్రం ఒక జోక్‌ వల్ల ఆగిపోయింది. అది బయల్దేరి వెళ్లాల్సిన సమయం కంటే దాదాపు  16 గంటలు ఆలస్యమైంది. ఇంతకీ ఏంజరిగిందంటే..

బెంగళూరు నుంచి సింగపూర్‌ బయల్దేరి వెళ్లాల్సిన విమానం సోమవారం తెల్లవారు జామున 1:20 గంటలకు టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలో ఓ ప్రయాణికుడు తన సీట్‌ నుంచి లేచి వెళ్లి తన బ్యాగులో గన్ ఉందంటూ విమాన సిబ్బందికి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అతడిని విమానంలో నుంచి దింపి విమానశ్రయంలో ఉన్న పోలీసులకు అప్పగించారు.అసలేం జరిగిందో చెప్పమంటూ అతడిని గంటలపాటు పోలీసులు విచారించారు. అతడి లగేజిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి బ్యాగులో అతడి వస్తువులు గిటార్‌ తప్ప ఎటువంటి ఆయుధాలు లేవు. అయితే విమానంలోని ఇతర ప్రయాణికులు కూడా విమానం టేకాఫ్‌ అవ్వడానికి వీల్లేదంటూ డిమాండ్‌ చేశారు. ఈలోపు అతడు చెప్పింది అబద్ధమని భావించి చివరకు సాయంత్రం 5:23 గంటలకు టేకాఫ్‌ చేశారు. విమానాశ్రయంలోని పోలీసులు అతడిని విచారించగా తన దగ్గర ఉన్న గిటార్‌ను గన్‌గా చెప్పి జోక్‌ చేశానని ఆ వ్యక్తి చెప్పడం కొసమెరుపు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.