
తాజా వార్తలు
దిల్లీ: ఆర్థిక సంక్షోభంతో మూతబడిన జెట్ ఎయిర్వేస్కు ఇచ్చిన రుణాలను రికవరీ చేసుకునేందుకు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ముంబయి శివారులోని ఓ జెట్ ఎయిర్వేస్ ఆఫీస్‌ను అమ్మకానికి పెట్టింది.
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్‌కు జెట్ ఎయిర్వేస్ రూ. 414.80కోట్ల మేర అప్పుగా ఉంది. ముంబయి శివారులోని బంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) నాలుగో అంతస్తులో జెట్ ఎయిర్వేస్కు ఓ ఆఫీస్ ఉంది. హెచ్డీఎఫ్సీ నుంచి రుణాలు పొందే సమయంలో ఈ ఆఫీస్‌ను జెట్ తనఖా కింద పెట్టింది. ‘బకాయిలు చెల్లించడంలో జెట్ ఎయిర్వేస్ విఫలమైంది. దీంతో నిబంధనల ప్రకారం.. ఆ కంపెనీ తనఖా కింద పెట్టిన స్థిరాస్తిపై మాకు హక్కు లభించింది’ అని హెచ్డీఎఫ్సీ ఓ ప్రకటనలో తెలిపింది.
52,775 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆఫీస్‌ను రూ. 245 కోట్ల రిజర్వ్ ధరతో హెచ్డీఎఫ్సీ ఇ-వేలానికి పెట్టింది. మే 15న ఈ వేలం ప్రక్రియ జరగనున్నట్లు తెలిపింది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17న తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని నెలల నుంచి జెట్ తమ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారింది. దీంతో జీతాల కోసం సంస్థ సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
