Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 98732
            [news_title_telugu_html] => 

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో ఓలా క్రెడిట్‌ కార్డు

[news_title_telugu] => క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో ఓలా క్రెడిట్‌ కార్డు [news_title_english] => After Paytm Ola rolls out credit card bundled with cashbacks and rewards [news_short_description] => భారత్‌లో రోజుకోజుకీ పెరుగుతున్న డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకొనేందుకుగాను ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా ఓ అడుగు ముందుకేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. [news_tags_keywords] => Ola,Credit card,India [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-16 01:31:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో ఓలా క్రెడిట్‌ కార్డు - After Paytm Ola rolls out credit card bundled with cashbacks and rewards - EENADU
close

తాజా వార్తలు

క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో ఓలా క్రెడిట్‌ కార్డు

బెంగళూరు: భారత్‌లో రోజుకోజుకీ పెరుగుతున్న డిజిటల్‌ పేమెంట్స్‌ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకొనేందుకుగాను ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా ఓ అడుగు ముందుకేసింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, వీసా భాగస్వామ్యంతో భారత్‌లో తన మొట్టమొదటి క్రెడిట్‌కార్డును మంగళవారం ప్రవేశపెట్టింది. పేటీఎం తర్వాత ఇలా క్రెడిట్‌ కార్డు ప్రవేశపెట్టిన సంస్థ ఓలా కావడం గమనార్హం. 2022 నాటికి కోటి ఓలా క్రెడిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సంస్థ ఓక ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఓలా యాప్‌ ద్వారా ఈ క్రెడిట్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

లైఫ్‌టైం వ్యాలిడిటీతో వస్తున్న ఈ క్రెడిట్‌ కార్డులతో వివిధ రకాల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌, రివార్డ్‌ పాయింట్స్‌ను అందిస్తోందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విధమైన చెల్లింపు విధానంతో వినియోగదారులకు ఒక ఉత్తమమైన సేవలు లభిస్తాయని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 2015లో ఓలా మనీ వ్యాలెట్‌, 2016లో ఓలా క్రెడిట్‌ సదుపాయాలను సంస్థ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆర్థికపరమైన సేవల్లో భాగంగా వ్యాలెట్‌, పోస్ట్‌ పెయిడ్‌ బిల్లింగ్‌, ఓలా రైడ్స్‌నకు మైక్రో ఇన్సూరెన్స్‌,  తదితర సేవలను సమీప భవిష్యత్తులో అందించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు  కంపెనీ ప్రతినిధులు తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.