close

తాజా వార్తలు

స్పెన్సర్స్‌ చేతికి నేచర్స్‌ బాస్కెట్‌

ముంబయి: ప్రముఖ రిటైల్‌ రంగ దిగ్గజం స్పెన్సర్స్‌ తాజాగా కొత్త డీల్‌కు తెరతీసింది. గోద్రెజ్‌కు చెందిన నేచర్స్‌ బాస్కెట్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు ఆర్‌పీ సంజీవ్‌ గోయంకా గ్రూప్‌నకు గోద్రెజ్‌కు మధ్య అంగీకారం కుదిరింది. ఈ డీల్‌ విలువ రూ.300 కోట్లు ఉండవచ్చని అంచనా. ఈ డీల్‌కు రెగ్యూలేటరీలు, షేర్‌ హోల్డర్ల అనుమతులు రావాల్సి  ఉంది. దీనికి మరో మూడు నెలల్లో అన్ని అనుమతులు వచ్చేస్తాయని ఆర్‌పీ- సంజీవ్‌ గోయంకా గ్రూప్‌ రిటైల్‌ విభాగం అధిపతి తెలిపారు. 
ఈ డీల్‌తో ఆర్‌పీ సంజీవ్‌ గోయంకా గ్రూప్‌కు దేశంలో ఉన్న రిటైల్‌ స్టోర్ల సంఖ్య 192కు చేరుతుంది. ప్రస్తుతం నేచర్స్‌ బాస్కెట్‌ ముంబయి, పుణె, బెంగళూరుల్లో 36 స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ డీల్‌ తర్వాత రెండు బ్రాండ్లను కలిపేస్తారా.. లేక ప్రత్యేకంగా నిర్వహిస్తారా అనేది తేలాల్సి ఉంది. డీల్‌కు అనుమతులు వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ఆర్‌పీ సంజీవ్‌ గోయంకా గ్రూప్‌ చెబుతోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.