close

తాజా వార్తలు

ఎయిర్‌ ఇండియా సరికొత్త సర్వీసులు ?

ముంబయి: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. భోపాల్‌-పుణే-భోపాల్‌ , వారణాసి- చెన్నై-వారణాసి మార్గాల్లో కొత్త విమానాలను నడపనుంది. దీంతోపాటు జూన్‌ 1 నుంచి ముంబయి-దుబాయ్‌-ముంబయి మార్గంలో వారానికి 3,500 సీట్లను ఆఫర్‌ చేయనున్నట్లు వెల్లడించింది. జూన్‌ 2 నుంచి దిల్లీ-దుబాయ్‌-దిల్లీ మార్గంలో 3,500 సీట్లను కూడా ఆఫర్‌ చేయనుంది. ఈ మార్గంలో రెండు డి787 డ్రీమ్‌ లైనర్లను నడపనుంది. జులై 31 వరకు దిల్లీ, ముంబయి నుంచి దుబాయ్‌కు వెళ్లేందుకు రూ.7,777 ఛార్జీ వసూలు చేయనుంది. 
దీంతోపాటు దేశీయ మార్గంలో ఎయిర్‌ ఇండియా భోపాల్‌-పుణే-భోపాల్‌ , వారణాసి-చెన్నై-వారణాసి మార్గంలో జూన్‌ 5నుంచి విమానాలు నడపనుంది. దిల్లీ భోపాల్‌ మార్గంలో ప్రస్తుతం వారానికి 14 సర్వీసులు నడుపుతుండగా.. వీటిని 20కు పెంచనుంది. దీంతోపాటు దిల్లీ-రాయ్‌పూర్‌-దిల్లీ మార్గంలో ప్రస్తుతం వారానికి 7 విమానాలను నడుపుతుండగా ఆ సంఖ్యను 14కు పెంచనుంది. వీటితోపాటు దిల్లీ- బెంగళూరు, దిల్లీ-అమృత్‌సర్‌,చెన్నై-అహ్మదాబాద్‌,చెన్నై-కోల్‌కతా , ముంబయి-వైజాగ్‌, దిల్లీ - వడోదరా మార్గంలో కూడా విమానాలను పెంచనుంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.