Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103694
            [news_title_telugu_html] => 

ప్రతీకారం తీర్చుకొనేందుకు చైనా ఏర్పాట్లు..! 

[news_title_telugu] => ప్రతీకారం తీర్చుకొనేందుకు చైనా ఏర్పాట్లు..!  [news_title_english] => China Prepares Law That May Ban US Tech Firms From Its Market [news_short_description] => టెక్‌ దిగ్గజం హువావేపై అమెరికా విధించిన ఆంక్షలపై చైనా రగిలిపోతోంది. దీంతో అమెరికా కంపెనీలపై ప్రతీకారం తీర్చుకొనేందుకు చట్టాలకు పదును పెడుతోంది. దీని ప్రకారం చైనాకు చెందిన సైబర్‌ స్పేస్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ కొన్ని నిబంధనలను సిద్ధం చేసింది. [news_tags_keywords] => China,Huawei,us [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-27 00:48:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రతీకారం తీర్చుకొనేందుకు చైనా ఏర్పాట్లు..!  - China Prepares Law That May Ban US Tech Firms From Its Market - EENADU
close

తాజా వార్తలు

ప్రతీకారం తీర్చుకొనేందుకు చైనా ఏర్పాట్లు..! 

 అమెరికా కంపెనీలపై ఆంక్షల చట్రం సిద్ధం

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజం హువావేపై అమెరికా విధించిన ఆంక్షలపై చైనా రగిలిపోతోంది. దీంతో అమెరికా కంపెనీలపై ప్రతీకారం తీర్చుకొనేందుకు చట్టాలకు పదును పెడుతోంది. దీని ప్రకారం చైనాకు చెందిన సైబర్‌ స్పేస్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ కొన్ని నిబంధనలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా కీలకమైన విదేశీ పరికరాలు, సేవలను పొందితే వచ్చే ముప్పును పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు వెల్లడించింది. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జూన్‌ 24లోపు ఈ ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెట్టనున్నారు. లీకింగ్‌, పోగొట్టుకోవడం, కీలక సమాచారం సరిహద్దులు దాటడం వంటి ముప్పులకు సంబంధించి ఈ నిబంధనలు ఉండవచ్చు. చైనా మార్కెట్లో ఉన్న అమెరికా సాంకేతికతను అడ్డుకొనేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడనున్నాయి. 

గత వారం చైనాకు చెందిన హువావే, దానికి చెందిన 68 అనుబంధ సంస్థలు అమెరికాకు చెందిన సంస్థల నుంచి ఎటువంటి సాంకేతికత కొనుగోలు చేయకుండా ఆంక్షలను విధించింది. దీనికి ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని అమెరికా పేర్కొంది. దీంతో హువావేతో అమెరికా టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఇంటెల్‌, క్వాల్‌కామ్‌, బ్రాడ్‌కామ్‌ సంస్థలు తెగదెంపులు చేసుకొన్నాయి. అయితే, హువావేపై నిషేధాన్ని అమెరికా 90 రోజులు సడలించింది. దీంతో హువావే ఫోన్లకు గూగుల్‌ యాప్‌ సేవలు అందని పరిస్థితి నెలకొంది. ఇది వాణిజ్య యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.