
తాజా వార్తలు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: జూన్ 17
ఆన్లైన్ పరీక్ష: జూన్ 23 నుంచి 30 వరకు
ఐటీ, ఎలక్ట్రానిక్స్.. దాని అనుబంధ రంగాల్లో కొత్త పరిశోధనలు, యువతకు ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) సెంటర్లను ఏర్పాటుచేసింది. వీటిల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో కోర్సులున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సీడ్యాక్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (సీ-సీఏటీ) నోటిఫికేషన్ విడుదలైంది.
ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్ని ఉన్నత స్థాయికి చేరేలా మేధోపరమైన నిపుణులను అందించడమే సీడ్యాక్ ముఖ్య ఉద్దేశం. ఏటా రెండు సార్లు ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. అగస్టు ప్రవేశాలకోసం జూన్‌లో; ఫిబ్రవరి ప్రవేశాలకు డిసెంబరులో టెస్ట్ ఉంటుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (పీజీడీ)లో మొత్తం 13 విభాగాలున్నాయి. వీటిని ప్రధానంగా మూడు సెక్షన్లుగా విభజించి ప్రవేశ అర్హత, ఎంపిక విధానాన్ని రూపొందించారు. ప్రతి కోర్సు కాలపరిమితీ ఆరు నెలలు.
పరీక్ష కేంద్రాల ఎంపిక: దేశవ్యాప్తంగా 36కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడల్లో పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు తమ సొంత ల్యాప్‌టాప్‌లో పరీక్ష రాసే వీలుంది. అందుకోసం దరఖాస్తు చేసే సమయంతో ఓన్ల్యాప్టాప్ ఆప్షన్ ఇవ్వాలి.
హైదరాబాద్‌లో: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో సీ డ్యాక్ సెంటర్ ఉంది. ఇది పీజీ డిప్లొమాలో పీజీడీఏసీ (120 సీట్లు), పీజీడీఈఎస్‌డీ (120 సీట్లు), పీజీడీఐటీఐఎస్ఎస్ (60 సీట్లు), పీజీడీవీఎల్ఎస్ఐ (40 సీట్లు), పీజీడీఎస్ఎస్డీ (60 సీట్లు), పీజీడీఏఎస్ఎస్డీ (40 సీట్లు) కోర్సులను అందిస్తోంది.
ఉద్యోగ అవకాశాలు: పీజీ డిప్లొమా కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారికి సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉపాధి అవకాశాలున్నాయి. సీడ్యాక్ కామన్ క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌ను ఏటా నిర్వహిస్తోంది. ప్రతి బ్యాచ్ వారిని వారు చదువుతున్న సెంటర్లను బట్టీ ప్రాంతాల వారీగా విభజించి బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, నొయిడా, పుణెలో ప్లేస్మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. దీనివల్ల దేశంలోని ఇతర సెంటర్లలో చదివే విద్యార్థులంతా సమాన ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. 2018లో సీడ్యాక్ క్యాంపస్ ప్లేస్మెంట్లో సుమారు 300 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు పాల్గొన్నాయి. ఇందులో మొత్తం 80 శాతం విద్యార్థులు ఉద్యోగం సాధించారు.
మరింత సమాచారం కోసం: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్), నలంద బిల్డింగ్, నెం.1 శివబాగ్, సత్యం థియేటర్ రోడ్, అమీర్‌పేట్, హైదరాబాద్-500016, తెలంగాణ.
వెబ్సైట్: www.cdac.in
సీడ్యాక్లోని వివిధ కోర్సులు, అర్హత, ప్రవేశాల వివరాల కోసం www.eenadupratibha.net చూడండి
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
