close

తాజా వార్తలు

28 ఏళ్ల కనిష్ఠానికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్లు

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్ల విలువ మరింత పడిపోయింది. ఉదయం సెషన్లో ఒకానొక దశలో షేర్ల విలువ 10% తగ్గి  రెండు దశాబ్దాల కనిష్ఠానికి చేరుకుంది. గత 28 ఏళ్లలో షేరు విలువ రూ.52.70లకు చేరడం ఇదే తొలిసారి. రిలయన్స్‌ ఇన్ఫ్రా వార్షిక ఫలితాలపై తాము అభిప్రాయం వెల్లడించలేమన్న ఆడిటర్లు అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీ, అనుబంధ సంస్థల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ఆ ప్రభావం షేర్ల మీద పడింది. 1991 ఫిబ్రవరి 1న ఈ కంపెనీ షేరు ఆ ధర వద్ద ట్రేడైంది.  అంతకు ముందు 1990 ఏప్రిల్‌ 12న కంపెనీ చరిత్రలోనే తొలిసారి షేరు విలువ రూ.35కు చేరింది.

ఎన్ని సంక్షోభాలు ఎదుర్కుంటున్నప్పటికీ రూ.104 ఉన్న షేరు విలువ జూన్‌ మాసానికి రూ.49కి చేరుకుంది. 2018-19(2019 నాలుగో త్రైమాసికానికి) రూ. 3,301 కోట్ల నష్టాన్ని చవి చూసినట్లు ఆ కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం అనిల్ అంబానీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆయన సంస్థల మీదా పడుతోంది. దీంతో ఆడిటర్లు సైతం వార్షిక ఫలితాలను వెల్లడించడానికి ముందుకు రావడం లేదు. కంపెనీ మనుగడ పై కూడా ఆడిటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.