close

తాజా వార్తలు

ఐదేళ్ల కనిష్ఠానికి యస్‌బ్యాంక్‌ షేర్లు

ముంబయి: యస్‌బ్యాంక్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో 8శాతం కుంగి ఐదేళ్ల కనిష్ఠస్థాయిని తాకాయి. గత నాలుగు రోజుల నుంచి ఈ బ్యాంక్‌ షేరు 20శాతం విలువ కోల్పోయింది. గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ యూబీఎస్‌ దీని లక్షిత ధరను రూ.170 నుంచి 90కు తగ్గించడంతో షేరు వేగంగా పడిపోతోంది. ఈ షేరు రూ.109.25 వద్ద  నేడు ట్రేడింగ్‌ ముగించగా.. ఒక దశలో రూ.107 వద్దకు చేరింది. 2014లో ఆగస్టు 12 వ తేదీన చివరిసారిగా ఈ ధర వద్ద ట్రేడైంది. 
చాలా విదేశీ బ్రోకరేజీ సంస్థలు ‘విక్రయించాలి’ రేటింగ్‌ను కొనసాగించడంతో మరింత తగ్గవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ బ్యాంకు ఆస్తుల నాణ్యతపై సందేహాలు రావడం, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్పొరేట్లకు రుణాలు ఇవ్వడం వంటి కారణాలతో రేటింగ్‌కు కోతపడుతోంది. మరోపక్క రేటింగ్‌ సంస్థ మూడీస్‌ కూడా ఈ బ్యాంక్‌ ఫారెన్‌ కరెన్సీ ఇష్యూర్‌ రేటింగ్‌ను బీఏ1గా పేర్కొంది. ఇది కంపెనీ క్రెడిట్‌ ప్రొఫైల్‌పై ప్రతికూలా ప్రభావం చూపుతోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.