close

తాజా వార్తలు

ఫేస్‌బుక్‌ క్రిప్టో కరెన్సీ లిబ్రా విశేషాలు..

న్యూయార్క్‌: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. క్రిప్టో కరెన్సీ రంగంలోకి అడుగుపెట్టింది. లిబ్రా పేరుతో సొంత క్రిప్టో కరెన్సీని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఫేస్‌బుక్‌ ఈ కామర్స్‌, గ్లోబల్‌ పేమెంట్స్‌ రంగంలోకి ప్రవేశించేందుకు వీలుగా వేసిన తొలిఅడుగుగా దీనిని భావిస్తున్నారు. ఫేస్‌బుక్‌ జెనీవాకు చెందిన లిబ్రా అనే సంస్థతో 28 మంది వ్యాపార భాగస్వాములను అనుసంధానించి దీనిని తయారు చేశారు. ఈ సంస్థ 2020 నాటికి ఈ డిజిటల్‌ కాయిన్‌ను చలామణిలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 
* ఇప్పటికే  ఫేస్‌బుక్‌ కలిబ్రా అనే మరో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ డిజిటల్‌ వాలెట్‌ సేవలను అందిస్తుంది. 
* ముఖ్యంగా లిబ్రాలను వినియోగించడానికి వీలుగా దీనిని తయారు చేశారు. 
* కలిబ్రా వాలెట్‌ ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు, వాట్సాప్‌కు అనుసంధానించనున్నారు. 
* ఇప్పటికే ఆర్థిక సేవలు పొందుతున్న వారే కాకుండా కొత్త వారికి ఈ రకమైన సేవలను దగ్గర చేయాలనేదే ఫేస్‌బుక్‌ లక్ష్యం. 
* రోమన్లు తూకానికి వాడే కొలతల నుంచి స్ఫూర్తి పొంది లిబ్రా అనే పేరుపెట్టారు. అంతేకాదు ఖగోళశాస్త్రం ప్రకారం న్యాయానికి కూడా ఇది చిహ్నం అందుకే ఈ పేరును ఎంచుకొన్నట్లు పేపాల్‌ మాజీ ఎగ్జిక్యూటీవ్‌, ఈ ప్రాజెక్టు హెడ్‌ డేవిడ్‌ మార్కోస్‌ తెలిపారు. ‘‘స్వేచ్ఛ, న్యాయం, డబ్బు.. ఇవే మేము చేయాలనుకుంది.’’ అని తెలిపారు. 
* చైనాలోని వుయ్‌ చాట్‌ వలే మెసేజింగ్‌ యాప్స్‌నుంచి ఆదాయం  పొందేలా ఫేస్‌బుక్‌ వీటిని తీసుకొచ్చింది. 
* ఇప్పటి వరకు సరైన విధానం లేని క్రిప్టోకరెన్సీ రంగంలోకి ఫేస్‌బుక్‌ రావడంతో న్యాయపరమైన సమస్యలు తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 
* ఈ ప్రాజెక్టులో మాస్టర్‌కార్డ్‌, వీసా, స్పాటిఫై, పేపాల్‌, ఈబే, ఉబర్‌ టెక్నాలజీ, వొడాఫోన్‌ గ్రూప్‌ వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములు. 
* 2020లో లిబ్రాను మార్కెట్లోకి విడుదల చేసేనాటికి కనీసం 100 మంది భాగస్వాములనునైనా చేసుకోవాలని ఫేస్‌బుక్‌ భావిస్తోంది. ప్రతిఒక్కరు కనీసం 10 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి అయినా తీసుకురావాలి. 
* 2019 తర్వాత ఫేస్‌బుక్‌ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం లేదు.
* కలిబ్రా వాలెట్‌ వినియోగించాలంటే బ్యాంకుల్లో ఖాతాలను పరిశీలిస్తారు. కీలకమైన ఖాతా కేసులకు సంబంధించిన  సమాచారం మాత్రమే కలిబ్రా భాగస్వాములకు కానీ, ఫేస్‌బుక్‌కు కానీ వెళుతుంది. చట్ట నిబంధనల ప్రకారం భద్రత కోసమే ఇలా చేస్తారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.