close

తాజా వార్తలు

మహీంద్ర ఎస్‌యూవీ మోడళ్లు మరింత ప్రియం

ముంబయి: దేశంలో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మహీంద్ర అండ్‌ మహీంద్ర తన మోడళ్లపై ధరలు పెంచినట్లు బుధవారం ప్రకటించింది. సంస్థ ఉత్పత్తి చేసిన వివిధ మోడళ్లపై గరిష్ఠంగా రూ.36 వేల వరకు ధరను పెంచిన మహీంద్ర, ఈ ఏడాది జులై‌ 1 పెంచిన కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. సంస్థ ఉత్పత్తి చేస్తున్న ప్యాసింజర్‌ వాహనాల్లో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని మార్పులు (ఏఐఎస్ 145 సేఫ్టీ నార్మ్స్‌) చేస్తున్న నేపథ్యంలో ఇతర మోడళ్లపై ధరలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది.

ఎఐఎస్‌ 145 సేఫ్టీ నార్మ్స్‌లో భాగంగా అన్ని ప్యాసింజర్‌ వాహనాల్లో డ్రైవర్‌ ఎయిర్‌బ్యాగ్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, ఓవర్‌ స్పీడ్‌ అలర్ట్‌ లాంటి భద్రతపరమైన మార్పులు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో మహీంద్ర అండ్‌ మహీంద్రకు చెందిన ఎస్‌యూవీ శ్రేణి వాహనాలైన మహీంద్ర స్కార్పియో, బొలెరో, టీయూవీ300, కేయూవీ100 ఎన్‌ఎక్స్‌టీపై గణనీయంగా పెంచగా.. ఎక్స్‌యూవీ500, మరాజో మోడళ్లపై స్పల్పంగా ధరలు పెంచినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ప్రయాణికుల భద్రతకు సంస్థ మొదటి ప్రాధాన్యతను ఇస్తుంది. భద్రతపరమైన ఎలాంటి ప్రతిపాదనలు వచ్చినా సంస్థ వాటిని స్వాగతిస్తుంది. ఇలాంటి నూతన నిబంధనలు అమలు చేసే సమయంలో ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. ఇది సహజం’ అని మహీంద్ర అండ్‌ మహీంద్ర ఆటోమోటివ్‌ విభాగం అధ్యక్షుడు రాజన్‌ వధేరా పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.