close

తాజా వార్తలు

ఎల్అండ్‌టీకి రూ.7వేల కోట్ల ప్రాజెక్టు

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ ఇంజనీరింగ్‌ దిగ్గజ సంస్థ లార్సెన్‌ టర్బో బిహార్‌లో భారీ పవర్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రూ.7వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును ఎస్‌జేవీఎన్‌ థర్మల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ (భారత ప్రభుత్వం, హిమాచల్‌ ప్రభుత్వ సంయుక్త సంస్థ) ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించింది. ఇందులో భాగంగా బిహార్‌ రాష్ట్రం బక్సార్‌ జిల్లాలో  2x660 మెగావాట్ల అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ ప్లాంటు నిర్మించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఎల్‌అండ్‌టీ సంస్థ సీఈఓ శైలేందర్‌ రాయ్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు తమకు దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నామని, బిహార్‌ రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు ఈ దీన్ని నిర్ధేశించిన గడువులోగా, నాణ్యంగా నిర్మిస్తామని అన్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.