close

తాజా వార్తలు

జగన్‌గారూ..రాష్ట్రం సురక్షితంగా లేదు:లోకేశ్‌

అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల మైనర్‌ బాలికపై జరిగిన అత్యాచార ఘటనను మాజీ మంత్రి నారా లోకేశ్‌ ట్విటర్‌లో ఖండించారు. ‘‘దేశంలోనే  సంచలనం కలిగించిన ఈ దుశ్చర్యలో నిందితులు వైకాపా కార్యకర్తలు కావడం సిగ్గు చేటు. జగన్‌ గారూ.. మీ పార్టీ పాలనలో రాష్ట్రం సురక్షితంగా లేదన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైంది’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇటీవల ఒంగోలులో మైనర్‌ బాలికపై ఆరుగురు కామాంధులు పదిరోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సహా ఆరుగురిని ఒంగోలు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.