close

తాజా వార్తలు

వారి వాణిజ్యయుద్ధం.. ఎవరికి లాభం?

దిల్లీ: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకీ ముదురుతుండడంతో భారత్‌ దీన్ని అవకాశంగా మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. వియత్నాం తరహాలో పన్ను రాయితీలతో పాటు పలు అవకాశాలు కల్పించి కంపెనీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు  ఓ అధికారి తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలు, ఫుట్‌వేర్‌, విద్యుత్‌ వాహనాల లాంటి పలు తయారీ పరిశ్రమలకు ఈ రాయితీలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే వియత్నాం, మలేషియా లాంటి దేశాలు పలు పన్ను మినహాయింపులను కల్పించి ఆర్థికంగా భారీగా నిలదొక్కుకున్నాయి. దీంతో భారత్‌ పెట్టుబడుల రూపంలో అనేక అవకాశాలను చేజార్చుకుంది. ప్రస్తుత చర్యలతో ఎగుమతులు పెరిగి వాణిజ్య లోటు తగ్గే అవకాశముంది. ఇక ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆమోదం తెలపడమే ఆలస్యం.

పన్ను రాయితీలతో పాటు పరిశ్రమల్ని ఆకట్టుకునేందుకు మరిన్ని వసతుల్ని కల్పించేందుకు కూడా భారత్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తీర ప్రాంతాల్లో ప్రత్యేక పరిశ్రమల జోన్ల ఏర్పాటు ప్రతిపాదనను పరిశీస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వ ప్రాజెక్టుల్లో స్థానిక కంపెనీలకు అవకాశాలు కల్పించేలా నిబంధనలు సడలించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల అమలు భారత ఉత్పత్తుల సామర్థ్యం పెరుగుదలకు ఎంతో దోహదం చేస్తుంది. అలాగే మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం గృహోపకరణాలు, విద్యుత్‌ వాహనాలు వాటి విడి భాగాలు, కిచెన్‌ వేర్‌, స్మార్ట్‌ఫోన్లు లాంటి పలు వస్తువులను భారత్‌ దాదాపు 95శాతం చైనా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయా కంపెనీలకు రాయితీలు, ఇతర వసతులు కల్పించడం వల్ల భారత్‌కు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనాకు అమెరికా చేస్తున్న ఎగుమతులను సైతం భారత్‌ అందిపుచ్చుకునేందుకు యోచిస్తోంది. దీంతో చైనాతో ఉన్న భారీ వాణిజ్య లోటు పూడ్చుకునే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా అంతర్జాతీయంగా భారత్‌ గొప్ప వాణిజ్య శక్తిగా ఎదిగే అవకాశం ఏర్పడుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.