close

తాజా వార్తలు

ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

తిరువనంతపురం: ఎయిరిండియా విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. సౌదీ అరేబియాలోని దమ్మాం నుంచి బయలేదేరి వచ్చి సోమవారం కేరళలోని కోలికోడ్‌ విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఐఎక్స్‌ 382 విమానం వెనుక భాగం రన్‌వేను తాకింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో ఆ విమానానికి కూడా ఎటువంటి నష్టం జరగలేదని తెలుస్తోంది.  

విమాన వెనుక భాగం రన్‌వేను తాకడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై ఎయిరిండియా అధికారి మీడియాతో మాట్లాడుతూ ‘‘విమానం దిగిన సమయంలో వెనుక భాగం రన్‌వేను తాకింది. అనంతరం దాన్ని పరిశీలించాం. విమానానికి నష్టం జరగలేదు. ఆ విమాన సేవలు కొనసాగుతాయి’’ అని ప్రకటించారు. కాగా, మరో ఎయిరిండియా విమానానికి ఆదివారం ప్రమాదం తప్పింది. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతున్న సమయంలో రన్‌వేనుంచి ట్యాక్సీవే వైపునకు వెళ్లింది. రన్‌వే తడిగా ఉండడమే ఇందుకు కారణమని తెలిసింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.