close

తాజా వార్తలు

ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌!

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్ ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సాహో’ను ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

‘హాయ్‌ డార్లింగ్స్‌. ప్రస్తుతం సాహో షూటింగ్‌ ఆస్ట్రియాలో జరుగుతోంది. గతంలో ఇలాంటి అనుభూతులను ఎప్పుడూ చూడలేదు. అద్భుతంగా ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో ప్రభాస్‌తో పాటు కథానాయిక శ్రద్ధాకపూర్‌ కూడా ఉంది.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కుతోంది. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.