close

తాజా వార్తలు

మార్కెట్లను ముంచిన బడ్జెట్‌

సెన్సెక్స్‌ 793 పాయింట్లు పతనం

సంపన్నులపై సర్‌ ఛార్జీలు నచ్చలేదు.. కంపెనీల్లో ప్రమోటర్ల వాటా తగ్గిస్తూ ప్రజల వాటా పెంచడం మింగుడుపడలేదు.. మొత్తంగా బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న సగటు మదుపరికి నిరాశే ఎదురైంది. ఫలితంగా షేర్లు అమ్మేశారు. ఈక్విటీల్లో పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇంకేముంది మార్కెట్లు బేర్‌ మన్నాయి. ఇక లేవలేం బాబోయ్‌ అన్నట్లు కుప్పకూలాయి. 

ముంబయి: బడ్జెట్‌ ప్రతికూలతలతో గత శుక్రవారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా అదే తీరును కొనసాగించాయి. ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌ అండ్ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌ లాంటి కీలక షేర్లు కుదేలవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. 

400 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ అమ్మకాల ఒత్తిడితో అంతకంతకూ దిగజారుతూ పోయింది. ఒక దశలో 900 పాయింట్లు కోల్పోయింది. అటు నిఫ్టీ కూడా ఏకంగా 200 పాయింట్లు కోల్పోయి 11,600 దిగువన ట్రేడ్‌ అయ్యింది. ట్రేడింగ్‌ ఆద్యంతం నష్టాల కడలిలో మునిగిన సూచీలు చివరకు భారీగా పతనమయ్యాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 793 పాయింట్లు దిగజారి 38,720 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయి 11,564 వద్ద స్థిరపడ్డాయి. 

ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ భారీగా నష్టపోయింది. ఈ కంపెనీ షేరు విలువ 10శాతం తగ్గింది. బజాజ్ ఫైనాన్స్‌, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హీరోమోటార్స్‌, ఎస్‌బీఐ ఇలా అన్ని రంగాల షేర్లు నష్లాలను చవిచూశాయి. ఒక్క యస్‌బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మాత్రమే లాభపడ్డాయి. శుక్ర, సోమ.. కేవలం ఈ రెండు సెషన్లలోనే రూ. 5లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.