
తాజా వార్తలు
చిన్నకుమారుడి పరిస్థితి విషమం
సికింద్రాబాద్ : భర్త పెట్టే వేధింపులు భరించలేక ఓ భార్య తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి తానూ తాగింది. ఈ ఘటనలో తల్లి మృతిచెందగా, చిన్నకుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయవిదారకరమైన ఈ ఘటన నగరంలోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏసీ బాలగంగిరెడ్డి కథనం ప్రకారం.. ప్రసాద్, అంజలి(28)దంపతులు పార్శీగుట్టలో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదో తరగతి, మూడో తరగతి చదువుతున్న అనిరుధ్ (10), అమృత్‌తేజ్(8) కుమారులున్నారు. ప్రసాద్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఉపాధి లేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. భార్య అంజలి స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. అయితే మద్యానికి డబ్బులివ్వమని ప్రసాద్ తరచూ భార్యను వేధించేవాడు. ఇవ్వకుంటే ఇతరులతో ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు నిందించేవాడు. ప్రసాద్ తీరుతో విసిగి వేసారిన అంజలి గత నెల జూన్ 15న చిలకలగూడ పోలీసులను ఆశ్రయించింది. అక్కడి పోలీసులు కేసును బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు రిఫర్ చేశారు. దీంతో వారు మహిళా పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కండీషనల్ బెయిల్ మీద ప్రతిరోజూ ప్రసాద్ ఠాణాలో సంతకం చేయాలని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం నడుస్తున్న క్రమంలోనే అంజలి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో శీతలపానీయంలో విషం కలిపి కుమారులకు ఇచ్చి తర్వాత తాను తాగింది. విషం తాగిన కాసేపటికి అనిరుధ్ బయటికెళ్లి వాంతులు చేసుకున్నాడు. తిరిగి ఇంట్లోకి రాగా.. అపస్మారకస్థితిలో పడి ఉన్న తన తల్లి, తమ్ముడిని చూసి ఇంటి యజమానికి సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన ఇంటి యజమాని వెంటనే వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించాడు. విషం మోతాదు ఎక్కువగా తీసుకోవడంతో అంజలి మృతిచెందింది. చిన్న కుమారుడు అమృత్‌తేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అంజలి రాసిన లేఖ లభ్యమైనట్లు ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి తెలిపారు. అంజలి తల్లి కమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వదిలేశారు..
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
