close

తాజా వార్తలు

మీరే పేరు పెట్టండి : షామీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షామీ ఇప్పటివరకు విడుదల చేసిన ఫోన్లలో రెడ్‌మి నోట్‌7 సిరీస్‌కు ప్రత్యేక స్థానం. ఇప్పుడు ఆ మోడల్‌లో కొత్త వేరియంట్‌ విడుదల చేస్తునట్టు ఆ సంస్థ ప్రకటించింది. పేరు మాత్రం ఇంకా చెప్పలేదు. కానీ, తన అధికారిక వీబో పేజీలో ఆ మొబైల్‌ ఫొటోలను ఉంచింది. వాటిని చూసి మొబైల్‌ ప్రియులు ఈ మోడల్‌కు తగిన పేరును సూచించాలని షామీ విజ్ఞప్తి చేసింది. వెనుకవైపు గ్లాస్‌ వైట్‌ ప్యానల్‌తో ఉన్న ఈ మోడల్‌ ఆకృతి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇప్పటికే చైనాలో విడుదలైన ఎంఐ సీసీ9, సీసీ9ఈ మోడళ్లతో పోలిస్తే, అంత ఆకర్షణీయంగా లేదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ మొబైళ్లను భారత్‌తో పాటు ఇతర మార్కెట్లలోనూ తీసుకురానున్నారు. కొత్త మొబైల్‌కు పేరు ఎంపికైన వారికి షామీ బ్రీఫ్‌కేస్‌ను బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.