close

తాజా వార్తలు

ఈ ఫోన్‌ అక్షరాలా రూ.4.80లక్షలు!

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్మార్ట్‌ ఫోన్‌ రెడ్‌ మి కె20ప్రో బుధవారం భారత మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఫ్లాగ్‌షిప్‌ కిల్లర్‌గా దీన్ని తీసుకొస్తున్నామని షామీ ఇండియా ఎండీ మనుకుమార్‌ జైన్‌ గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ధర ఎంత పెడతారన్న దానిపైనే టెక్‌ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. బుధవారం జరిగే కార్యక్రమంలో షామీ ఈ ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో మనుకుమార్‌ జైన్‌ ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. రెడ్‌మి కె20ప్రో  స్పెషల్‌ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ ఫోన్‌ ధర అక్షరాల రూ.4.8లక్షలు అని ప్రకటించారు. 

ఈ ప్రత్యేక ఫోన్‌ బ్యాక్‌ కేస్‌ను బంగారంతో తయారు చేయగా, వజ్రాలతో పొదిగిన ‘కె’ అక్షరాన్ని లోగోగా అమర్చారు. బుధవారం విడుదల చేయనున్న రెడ్‌మి కె20, కె20ప్రోలతో పాటు ఈ ఫోన్‌ను కూడా ఆవిష్కరించనున్నారు. ఇప్పటివరకూ బయటకు వచ్చిన వివరాల ప్రకారం రెడ్‌మి కె20ప్రో ప్రత్యేకతల విషయానికొస్తే... 6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, వెనుకవైపు 48+13+8 మెగాపిక్సెల్‌ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, ముందువైపు 20మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్‌ వస్తుందని చెబుతున్నారు. 
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.