close

తాజా వార్తలు

ప్రభుత్వానికి ఇవ్వాల్సిందే..?

 బిమల్‌ జలాన్‌ కమిటీ సూచనలు

దిల్లీ: ఆర్‌బీఐ వద్ద మిగులు రిజర్వును ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనని ఎకనామిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌ వర్క్‌పై ఏర్పాటు చేసిన బిమల్‌ జలాన్‌ కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. బుధవారం ఈ కమిటీ సమావేశమై నివేదికకు తుదిమెరుగులు దిద్దింది. త్వరలో ఈ నివేదికను రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌కు సమర్పించనుంది.
 ‘‘ఆర్‌బీఐ వద్ద మిగులు నిధులను విడతల వారీగా మూడు నుంచి ఐదేళ్లలో ప్రభుత్వానికి బదలాయించాలి’’ అని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కాకపోతే ఈ నివేదికపై ప్యానల్‌లోనే భిన్నాభిప్రాయలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద ఉన్న ఆస్తుల్లో 27శాతం మిగులుగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు 14శాతం  రిజర్వును నిర్వహిస్తున్నాయి. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.