close

తాజా వార్తలు

మల్టీ బ్రాండ్‌ రిటైల్‌లో వారిని అనుమతించం

దుకాణదారులు, రిటైల్‌ వ్యాపారులకు కొత్త పెన్షన్‌ పథకం

దిల్లీ: భారత్‌లో మల్టీ బ్రాండ్ రిటైల్ వాణిజ్య నిర్వహణకు విదేశీ కంపెనీలను అనుమతించే ప్రతిపాదనలు ప్రభుత్వానికి లేవని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్ లోక్‌సభలో ప్రకటించారు. రిటైల్ రంగం వృద్ధికి ఆటంకం కలిగించే నియమ నిబంధనలను సరళీకృతం చేసి రిటైల్ వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని గోయల్ లోక్‌సభలో వివరించారు. లోక్‌సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన లిఖితపూర్వకంగా ఈ వివరాలు వెల్లడించారు.

‘రిటైల్‌ రంగం అభివృద్ధికిగాను జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రిటైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై పరిశ్రమలు, వాణిజ్య సంఘాలు, సంబంధిత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ)తో సంప్రదింపులు జరుగుతోంది. ఈ చర్చల్లో భాగంగా రిటైల్‌ రంగంలో తీసుకురావాల్సిన మార్పులపై ఎన్నో విలువైన సలహాలు, సూచనలు అందించారు. జాతీయ రిటైల్‌ వాణిజ్య విధాన రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది. సాధ్యమైనంత తొందరగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వస్తుంది’ అని గోయల్‌ పార్లమెంటులో వివరించారు.

దుకాణదారులు, రిటైల్‌ వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికోసం ప్రధాన్‌మంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్‌ యోజన (పీఎం-ఎల్‌వీఎంవై) అనే నూతన పెన్షన్‌ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపిందని ప్రశ్నోత్తరాల సమయంలో పార్లమెంటులో ఆయనను ఆడిగిన మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. ‘ఈ పథకం 18 నుంచి 40 ఏళ్ల వయసు వారికి వర్తిస్తుంది. దీనిలో ఎవరికి తోచినంత వారు జమచేయొచ్చు. వారు జమచేసిన దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కలుపుతుంది. వార్షిక టర్నోవర్‌ రూ. 1.5 కోట్లకు తక్కువగా ఉండి జీఎస్‌టీఎన్‌లో నమోదు చేసుకున్నవారు, పన్నుల పరిధిలోకి రానివారు, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ, ఎన్‌పీఎస్‌లో నమోదు కానివారు ఈ పెన్షన్‌ పథకానికి అర్హులని ఆయన వివరించారు.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.