close

తాజా వార్తలు

సెబీకి ఫిర్యాదు.. సెలవుపై కేర్‌ సీఈవో!

ముంబయి: ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ కేర్‌ రేటింగ్స్‌ లిమిటెడ్‌ తన సీఈవోను సెలవుపై పంపింది.  ఆయన తీరుపై సెబీకి ఫిర్యాదు రావడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని కంపెనీ నేడు సెబీకి తెలియజేసింది. సీఈవో రాజేష్‌ మోక్షిని సెలువుపై పంపాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపింది. ఇప్పటికే రేటింగ్‌ ఏజెన్సీలపై సెబీ కూడా దృష్టి సారించింది. దీంతో ఈ నెలలోనే మూడీస్‌ ఎండీ కూడా  సెలవుపై వెళ్లిపోయారు. ఆయనపై విచారణ జరిగే అవకాశం ఉండటంతో సెలవుపై వెళ్లిపోయారు. 
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ప్రారంభం నుంచి క్రెడిట్‌ ఏజెన్సీలు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ముందుగా పసిగట్టలేకపోయాయి. ఇప్పుడు ఈ సంస్థ చెల్లింపులు చేయలేకపోతుండటంతో రూ.90వేల కోట్ల సంక్షోభం తలెత్తింది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.