close

తాజా వార్తలు

రొటేట్‌ కెమెరాతోశాంసంగ్‌ ఏ80

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌ తన మొబైల్‌ శ్రేణిలో మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఏ80 పేరుతో విడుదల చేసిన ఈ మొబైల్‌ ధరను రూ.47,990గా నిర్ణయించారు. గెలాక్సీ ఏ సిరీస్‌లోనే ఇది అత్యంత ఖరీదైనది. జులై 22 నుంచి 31 వరకు ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్నారు. దీంతో పాటు అనుకోని పరిస్థితుల్లో మొబైల్‌ స్క్రీన్‌ పగిలిపోతే ఒకసారి రీప్లేస్‌మెంట్‌ చేయనుంది. ఇక సిటీ బ్యాంకు క్రెడిట్‌కార్డు వినియోగదారులు ఈ ఫోన్‌ కొనుగోలుపై అదనంగా మరో 5శాతం రాయితీని పొందవచ్చు. శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌, శాంసంగ్‌ ఒపేరా హౌజ్‌లలో ఇది ముందస్తు బుకింగ్‌లు చేసుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి రిటైల్‌ షాపుల్లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇది తెలుపు, నలుపు, గోల్డ్‌ కలర్‌లలో లభిస్తుంది.

దీని ప్రత్యేకతలు..
* 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ సూపర్‌ ఆమోల్డ్‌ డిస్‌ప్లే
* స్నాప్‌డ్రాగన్‌ 730జీ ప్రాసెసర్‌
* 8జీబీ ర్యామ్‌+128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ 
* 48+8 మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ రొటేట్‌ కెమెరా, ఐఆర్‌ సెన్సార్‌తో 3డీ డెప్త్‌ కెమెరా
* 3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 25వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.