Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 129696
            [news_title_telugu_html] => 

అందుకే ఆ పదవి రేసులో లేను: రాజన్‌

[news_title_telugu] => అందుకే ఆ పదవి రేసులో లేను: రాజన్‌ [news_title_english] => Rajan reveals why he didnt apply for top job at BoE [news_short_description] => బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌(బీఓఈ) గవర్నర్‌ మార్క్‌ క్యార్నీ పదవీ కాలం జనవరితో ముగియనుంది. ఆ స్థానంలో రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి...... [news_tags_keywords] => raghuram rajan,BOE,EU,RBI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-22 00:24:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అందుకే ఆ పదవి రేసులో లేను: రాజన్‌ - Rajan reveals why he didnt apply for top job at BoE - EENADU
close

తాజా వార్తలు

అందుకే ఆ పదవి రేసులో లేను: రాజన్‌

వాషింగ్టన్‌: బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌(బీఓఈ) గవర్నర్‌ మార్క్‌ క్యార్నీ పదవీ కాలం జనవరితో ముగియనుంది. ఆ స్థానంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. రాజన్‌ మాత్రం అందుకు సుముఖంగా లేరు. బ్రెగ్జిట్‌ నేపథ్యంలో బీఓఈపై తీవ్ర రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందని.. అందుకే ఆ పదవికి తాను దరఖాస్తు చేసుకోలేదని రాజన్‌ బీబీసీకి ఇచ్చిన ముఖాముఖీలో వెల్లడించారు. పలు దేశాల కేంద్ర బ్యాంకు వ్యవహారాల్లో ఇటీవల రాజకీయ జోక్యం పెరిగిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ వైదొలగనున్న నేపథ్యంలో ఆ దేశం తీవ్ర ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కోనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యార్నీ వారసుడిగా.. అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న వ్యక్తిని నియమించాలని బ్రిటన్‌ భావిస్తోంది. దాని కోసం వేట ప్రారంభించింది. ఇప్పటి వరకు 30మంది అందుకు పోటీ పడుతున్నట్లు సమాచారం. 

బీఓఈ గవర్నర్‌ పదవిపై రాజన్‌ స్పందిస్తూ.. బ్రిటన్‌ రాజకీయాలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అయితేనే ఆ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించగలరని అభిప్రాయపడ్డారు. తనకు ఆ దేశ రాజకీయ వ్యవస్థపై లోతైన అవగాహన లేదని తెలిపారు. రాజన్‌ తరహాలోనే ఇతర దేశాల ప్రముఖులు సైతం ఆ పదవిపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో సొంత దేశం నుంచే ఎవరినో ఒకర్ని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.