close

తాజా వార్తలు

వోడా-ఐడియాతో జీ5యాప్‌

దిల్లీ: ఇకనుంచి వొడాఫోన్‌-ఐడియా వినియోగదారులకు జీటీవి కార్యక్రమాలను అందించే జీ5 యాప్‌ను ప్రత్యేకంగా అందించనున్నట్లు వొడాఫోన్‌-ఐడియా సంస్థ సోమవారం తెలిపింది. వివరాల్లోకి వెళితే టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడా-ఐడియాల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఆ పోటీని తట్టుకోవాలంటే తమ వినియోగాదారులకు మరిన్ని అదనపు సేవలు అందించాలని వొడాఫోన్‌-ఐడియా భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న జీ5యాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వొడాఫోన్‌ ప్లే, ఐడియా మూవీస్‌, టీవీ యాప్‌ల మాదిరిగా జీ5 యాప్‌ను వొడా-ఐడియా వినియోగదారులు వినియోగించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ యాప్‌లో వెబ్‌సీరీస్‌లు, కామెడీషోలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఒప్పందంతో తమకు కూడా చందాదారులు పెరుగుతారని జీ5యాప్‌ భావిస్తోంది. దీనిపై జీ5 ఇండియా హెడ్‌ మనీష్‌ అగర్వాల్‌ స్పందిస్తూ ఈ ఒప్పందంతో జీ5లో కార్యక్రమాలు చూసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.