
తాజా వార్తలు
దిల్లీ: దక్షిణకొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తీసుకొచ్చిన కాంపాక్ట్ ఎస్యూవీ ‘వెన్యూ’కు భారత మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. కారును విడుదల చేసిన తర్వాత కేవలం 60 రోజుల్లోనే ఈ కారు కోసం 50వేల మంది బుకింగ్ చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో ఇప్పటికే 18వేల కార్లను డెలివరీ చేసినట్లు తెలిపింది.
మే 2న ఈ కారు బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. తొలి రోజే 2వేల బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. మే 21న వెన్యూను మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీని ధర రూ. 6.5లక్షల నుంచి రూ. 11.1లక్షలుగా(ఎక్స్ షోరూం దిల్లీ) ఉంది. మూడు రకాల ఇంజిన్స్ ఆప్షన్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. 1లీటర్ టర్బో, 1.2లీటర్ పెట్రోల్ పవర్‌ట్రైన్స్, 1.4లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఇది రానుంది. అదే సమయంలో వాటి శ్రేణిని బట్టి ధరలను కూడా ప్రకటించారు. పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.5లక్షల నుంచి 11.1లక్షల మధ్య ఉండగా, డీజిల్‌తో నడిచే వాహనం ధర రూ.7.75లక్షల నుంచి 10.84లక్షల మధ్య ఉంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- కిర్రాక్ కోహ్లి
- తీర్పు చెప్పిన తూటా
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
