close

తాజా వార్తలు

హాలీవుడ్‌ సినిమానా?.. తెలుగు సినిమానా?

‘సాహో’ ట్రైలర్‌.. సెలబ్రిటీల ట్వీట్లు 

హైదరాబాద్‌: ‘సాహో’ ట్రైలర్‌పై సెలబ్రిటీలు ప్రశంసల జల్లు కురిపించారు. సినిమాను హాలీవుడ్‌ తరహాలో రూపొందించారని మెచ్చుకున్నారు. ఆగస్టు 30న చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. శోభూ యార్లగడ్డ, రానా, సాయిధరమ్‌ తేజ్‌, బ్రహ్మాజీ తదితరులు ట్వీట్లు చేసిన వారిలో ఉన్నారు.

* శోభూ యార్లగడ్డ: సూపర్‌.. సినిమాను చూడాలని చాలా ఆతృతగా ఉంది.
* సాయిధరమ్‌ తేజ్‌: చాలా సమయం తీసుకున్నా.. ప్రతి ఒక్క తెలుగు వాడు గర్వపడేలా చేశారు డార్లింగ్స్‌. ప్రభాస్‌ అన్న సిక్సర్‌ కచ్చితంగా మైదానం దాటేస్తుంది.
* బ్రహ్మాజీ: హాలీవుడ్‌ సినిమానా.. తెలుగు సినిమానా.. ఇంటర్నేషనల్‌ స్టేడియంలో సిక్స్‌లు కన్ఫాం. ప్రభాస్‌ అద్భుతం.. ఈ కుర్ర డైరెక్టర్‌ సూపర్‌.. మీకు శుభాకాంక్షలు.
* సందీప్‌ కిషన్‌: అద్భుతం.. ఇంత గొప్ప తెలుగు చిత్ర పరిశ్రమలో నేను పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. సుజీత్‌ సూపర్‌.. ప్రభాస్‌ కేక..
* సునీల్‌: ‘సాహో’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సినిమా చూడాలని ఆతృతగా ఉంది. నా సోదరుడు ప్రభాస్‌కు ఆల్‌ ది బెస్ట్‌.
* రాహుల్‌ రవీంద్రన్‌: వావ్‌.. అద్భుతమైన విజువల్స్‌. సినిమా కోసం ఎదురుచూస్తున్నా.
* గోపీ మోహన్‌: సూపర్‌ ట్రైలర్‌.. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్‌, సినీ ప్రేమికుల్లో ఆతృత పెంచింది. ఆగస్టు 30 కోసం ఎదురుచూస్తున్నా.
* రానా: సాహో..

* నితిన్‌: టాప్‌ క్లాస్‌, మైండ్‌ బ్లోయింగ్‌.. ‘సాహో’ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్. చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నా.
* హరీష్‌ శంకర్‌: తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించాల్సిన సమయం ఇది. ‘సాహో’ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ కుడోస్‌.
* బాబీ: ‘సాహో’ ట్రైలర్‌ చూసేందుకు అద్భుతంగా ఉంది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాను బిగ్‌ స్క్రీన్‌లో చూడాలని ఆతృతగా ఉంది. ప్రభాస్‌కు ఆల్‌ ది బెస్ట్‌.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.