close

తాజా వార్తలు

భారత్‌లోకి సోనీ-అలెక్సా స్పీకర్లు..!

దిల్లీ: సోనీ ఇండియా భారత్‌లో స్మార్ట్‌ స్పీకర్లను తీసుకొచ్చింది. ఎస్‌ఆర్‌ఎస్‌-ఎక్స్‌బీ402ఎం మోడల్‌ను సోమవారం ప్రవేశపెట్టింది. వీటిల్లో అమెజాన్‌ స్మార్ట్‌ అసిస్టెంట్‌ అలెక్సా కూడా ఉంది. దీని ధర రూ.24,990గా నిర్ణయించారు. దీని బ్యాటరీ ఏకధాటిగా 12గంటల పాటు పనిచేయగలదు. 
ఆగస్టు 12 నుంచి 18 వరకు ముందస్తు బుకింగ్స్‌ చేసుకొంటే రూ.19,990కు ఈ స్పీకర్లు లభిస్తాయి. దీంతోపాటు రూ.2,490 విలువ చేసే ఎడీఆర్‌-ఎక్స్‌బీ450ఏపీ హెడ్‌ఫోన్‌ ఉచితంగా లభిస్తుంది. దేశవ్యాప్తంగా సోనీ బ్రాండ్‌ దుకాణాల్లో, ఈకామర్స్‌ పోర్టల్స్‌లో లభిస్తాయి. ‘‘వినియోగదారులు మంచి బేస్‌ను ఈ స్పీకర్లలో ఎంజాయ్‌ చేస్తారు. దీనిలో అదనంగా బేస్‌ స్పీకర్‌ కూడా ఉంది. కేవలం మీ నోటి మాటతోనే అలెక్సా పార్టీని ప్రారంభిస్తుంది.’’ అని సోనీ ఒక ప్రకటనలో పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.