Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143931
            [news_title_telugu_html] => 10శాతం వృద్ధితో ఆ లక్ష్యం సాధ్యమే: కామత్‌
            [news_title_telugu] => 10శాతం వృద్ధితో ఆ లక్ష్యం సాధ్యమే: కామత్‌
            [news_title_english] => India can become 5 trillion dollar economy at 10pc growth kv kamath
            [news_short_description] => అంతర్జాతీయంగా వస్తున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉందని న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఎన్‌డీబీ) అధ్యక్షుడు కె.వి.కామత్‌ తెలిపారు. మౌలిక, ఉత్పత్తి, సాంకేతిక రంగాల వృద్ధితో రానున్న ఐదేళ్లలో 10శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందన్నారు.........

            [news_tags_keywords] => KV Kamath,economy,NDB
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-18 10:04:04
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
10శాతం వృద్ధితో ఆ లక్ష్యం సాధ్యమే: కామత్‌ - India can become 5 trillion dollar economy at 10pc growth kv kamath - EENADU
close

తాజా వార్తలు

10శాతం వృద్ధితో ఆ లక్ష్యం సాధ్యమే: కామత్‌

దిల్లీ: అంతర్జాతీయంగా వస్తున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే శక్తి భారత్‌కు ఉందని న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఎన్‌డీబీ) అధ్యక్షుడు కె.వి.కామత్‌ తెలిపారు. మౌలిక, ఉత్పత్తి, సాంకేతిక రంగాల వృద్ధితో రానున్న ఐదేళ్లలో 10శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సాధ్యమేనన్నారు. ప్రస్తుతం ఆటో రంగంలో నెలకొన్న మందగమనం కేవలం భారత్‌కే పరిమితం కాదని ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రజలు ప్రయాణాలకు ఇతర ప్రత్యామ్నాలను ఎంచుకుంటుండడం మందగమనానికి ఓ కారణమన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిర పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ భవిష్యత్తు ఏంటన్న ప్రశ్నకు కామత్‌ సమాధానమిస్తూ.. భారత్‌పై దాని ప్రభావం పెద్దగా ఉండదన్నారు. దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందన్నారు. 

గత రెండు దశాబ్దాల్లో చైనా సాధించిన రెండంకెల వృద్ధి రేటు భారత్‌కు కూడా సాధ్యమేనని కామత్‌ తెలిపారు. కొన్ని కీలక రంగాలని పరుగులు పెట్టించడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. నీటి వసతులు, పశుపోషణలో భారత్‌ ఇంకా అందిపుచ్చుకోవాల్సింది చాలా ఉందన్నారు. అలాగే మౌలిక రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రస్తుతం కేవలం ఉత్పత్తి రంగానికి మాత్రమే ప్రభుత్వ తోడ్పాటు లభిస్తోందన్నారు. డిజిటల్‌, సాంకేతికత రంగాల్లోనూ ఇంకా వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.