Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143992
            [news_title_telugu_html] => రేనాల్ట్‌ ట్రైబర్‌ బుకింగ్స్‌ ప్రారంభం
            [news_title_telugu] => రేనాల్ట్‌ ట్రైబర్‌ బుకింగ్స్‌ ప్రారంభం
            [news_title_english] => Renault Triber Bookings Open At Rs11000
            [news_short_description] => ఫ్రాన్స్‌ కంపెనీ రేనాల్ట్‌ సరికొత్త మోడల్‌ ట్రైబర్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ను శనివారం ప్రారంభించింది. ఆన్‌లైన్‌లోని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. టోకెన్‌ మొత్తం కింద రూ.11,000 వేలు చెల్లించాలి. నాలుగు మీటర్లు పొడవుండే ఈ కారు 7సీటర్‌ మోడల్‌గా మార్కెట్లోకి 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-19 00:28:37
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
రేనాల్ట్‌ ట్రైబర్‌ బుకింగ్స్‌ ప్రారంభం - Renault Triber Bookings Open At Rs11000 - EENADU
close

తాజా వార్తలు

రేనాల్ట్‌ ట్రైబర్‌ బుకింగ్స్‌ ప్రారంభం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్రాన్స్‌ కంపెనీ రేనాల్ట్‌ సరికొత్త మోడల్‌ ట్రైబర్‌ను త్వరలో భారత్‌లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ను శనివారం ప్రారంభించింది. ఆన్‌లైన్‌లోని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. టోకెన్‌ మొత్తం కింద రూ.11,000 వేలు చెల్లించాలి. నాలుగు మీటర్లు పొడవుండే ఈ కారు 7సీటర్‌ మోడల్‌గా మార్కెట్లోకి రానుంది. చాలా సరికొత్త ఫీచర్లను ఈ కారులో అమర్చినట్లు రేనాల్ట్‌ వెల్లడించింది. ఈ కారులో ఈజీఫిక్స్‌ అనే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో కారు క్యాబిన్‌ను అవసరాల్ని బట్టి 100 రకాలుగా మార్చుకోవచ్చు. 
ఇప్పటికే దీని ఉత్పత్తిని రేనాల్ట్‌ చేపట్టింది. తొలికారు చైన్నై ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయింది. ఆగస్టు 28 తర్వాత కారు విక్రయాలను ప్రారంభిస్తారు. రేనాల్ట్‌ యూరోపియన్‌ మోడళ్ల నుంచి స్పూర్తి పొంది దీనిని తయారు చేశారు. ఈ కారులో 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌ను అమర్చారు. దీనిలో 8అంగుళాల టచ్‌ స్క్రీన్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్లు, సీట్‌బెల్ట్‌ రిమంబర్‌ సిస్టమ్‌, 1.0 పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. 6250 ఆర్‌పీఎం వద్ద 71బీహెచ్‌పీ శక్తి, 3500 ఆర్‌పీఎం వద్ద 96 ఎన్‌ఎం టార్క్‌ను ఇది విడుదల చేస్తుంది. దీంతోపాటు 5స్పీడ్‌ మాన్యూవల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్లను అమర్చారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.