Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144456
            [news_title_telugu_html] => అందుకే ఉద్యోగం పోయింది..!
            [news_title_telugu] => అందుకే ఉద్యోగం పోయింది..!
            [news_title_english] => Reasons Behind Automotive Industry Slowdown In 2019
            [news_short_description] => టాటా మోటార్స్‌.. మారుతీ సుజుకీ.. మహీంద్రా అండ్‌ మహీంద్రా.. హీరో మోటోకార్ప్‌.. వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభానికి బెంబేలెత్తిపోతున్నాయి. 11 నెలల నుంచి వాహనరంగంలో కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇక ప్యాసింజర్‌ వాహనాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వరుసగా తొమ్మిది నెలల నుంచి కొనుగోళ్లు నేలచూపులు చూస్తున్నాయి. ఫలితంగా 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-19 11:26:04
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
అందుకే ఉద్యోగం పోయింది..! - Reasons Behind Automotive Industry Slowdown In 2019 - EENADU
close

తాజా వార్తలు

అందుకే ఉద్యోగం పోయింది..!

 తీవ్ర సంక్షోభంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ

ఇంటర్నెట్‌డెస్క్‌: టాటా మోటార్స్‌.. మారుతీ సుజుకీ.. మహీంద్రా అండ్‌ మహీంద్రా.. హీరో మోటోకార్ప్‌.. వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల కాలంలో ఆర్థిక సంక్షోభానికి బెంబేలెత్తిపోతున్నాయి. 11 నెలల నుంచి వాహనరంగంలో కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇక ప్యాసింజర్‌ వాహనాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వరుసగా తొమ్మిది నెలల నుంచి కొనుగోళ్లు నేలచూపులు చూస్తున్నాయి. ఫలితంగా దేశంలోని చాలా కంపెనీలు ఉత్పత్తిని తగ్గించేశాయి. ఇప్పటికే ఖర్చుకు కళ్లెం వేయడానికి తాత్కాలిక ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే డిమాండ్‌ 31శాతం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2000 సంవత్సరం తర్వాత డిమాండ్‌ ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి. 
ఫలితంగా ఇప్పటికే ఆటోమొబైల్‌, అనుబంధ రంగాల్లో 2.15లక్షల ఉద్యోగాలు పోయాయి. దేశంలో అత్యధికంగా ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న వాటిల్లో ఆటోమొబైల్‌ పరిశ్రమ రెండో స్థానంలో ఉంది.. దాదాపు 3.5కోట్లకుపైగా కుటుంబాలు ఆటోమొబైల్‌ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. గిరాకీ లేనందున, ఉత్పత్తి తగ్గించేందుకు వాహన, విడిభాగాల కంపెనీలు కూడా కొన్ని రోజుల పాటు ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నాయి. హీరో మోటో ఈ నెల 15-18 వరకు, టీవీఎస్‌ గ్రూప్‌నకు చెందిన సుందరమ్‌ క్లేటాన్‌(ఎస్‌సీఎల్‌) 2 రోజులు, లూకాస్‌-టీవీఎస్‌ 2 రోజులు ఉత్పత్తి నిలిపేశాయి. బాష్‌ సైతం తన రెండు ప్లాంట్లను 13 రోజుల పాటు, ప్రస్తుత త్రైమాసికంలో 8-14 రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేయనున్నట్లు ఎం అండ్‌ ఎం తెలిపింది.

ఆటోమొబైల్‌ పరిశ్రమకు పలు ఇతర పరిశ్రమలతో బలమైన సంబంధాలు ఉన్నాయి. వ్యవసాయం, రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకింగ్‌, మార్కెట్‌ ఇలా ప్రతి పరిశ్రమ ప్రగతి ఆటోమొబైల్‌ రంగంపై ప్రభావం చూపుతాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుంది ఆటోమొబైల్‌ పరిశ్రమ పరిస్థితి..

ఎన్‌బీఎఫ్‌సీల ప్రభావం..

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో వాహన కొనుగోళ్లకు నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు అత్యధికంగా అప్పులు ఇస్తున్నాయి. మూడింట ఒక వంతు కొనుగోళ్లు వీటి అప్పులతోనే జరుగుతాయి. కానీ, ఎన్‌బీఎఫ్‌సీలు ఇప్పుడు తీవ్రమైన  నగదు కొరతను ఎదుర్కొవడంతో రుణ లభ్యత తగ్గింది. దీంతో కొనుగోళ్లు పడిపోయాయి. మరోపక్క బ్యాంకులు వాహన కొనుగోళ్ల నిబంధనలను కఠిన తరం చేయడం కూడా పులిమీద పుట్రలాగ మారింది.  

బీఎస్‌-6పై స్పష్టత లేకపోవడం..

వచ్చే ఏడాది నుంచి బీఎస్‌6 నిబంధనలు అమల్లో రానుండంటంతో చాలా మంది వాహన కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపేశారు. ఫలితంగా అమ్మకాలు పడిపోయాయి. ఇప్పటికే ఉన్న వాహనాల పరిస్థితి ఏమిటీ అనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడం దీనికి మరో కారణం. ఇప్పటికే దిల్లీ మినహా దేశ వ్యాప్తంగా ఇంకా బీఎస్‌-6 ఇంధనం కూడా అందుబాటులోకి రాలేదు. 
మరోపక్క కంపెనీలు కూడా తమ సాంకేతికతను బీఎస్‌-6కు అప్‌గ్రేడ్‌ చేసుకోవాడానికి భారీగా వెచ్చించాల్సి వస్తోంది. అదే సమయంలో మార్కెట్లో వాహనాల డిమాండ్‌ పడిపోవడం వాటిని ఆర్థికంగా ఒత్తిడికి గురి చేస్తోంది.  బీఎస్‌-6 నిబంధనలు ముఖ్యంగా డీజిల్‌ ఇంజిన్ల భవిష్యత్తును ప్రమాదంలో పడేశాయి. పెట్రోల్‌ ఇంజిన్ల ధరలు రూ.30వేల వరకు పెరిగితే.. డీజిల్‌ ఇంజిన్ల ధరలు రూ.1లక్ష నుంచి 1.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. వీటి జీవితకాలాన్ని ఇప్పటికే దిల్లీలో 10 ఏళ్లకు కుదించారు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేస్తారనే భయాలు ఉన్నాయి. 
డీజిల్‌కార్ల నిర్వహణ భారీగా పెరగనుండటంతో చాలా  కంపెనీలు ఆ ఇంజిన్ల తయారీకే స్వస్తి చెప్పనున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆ మేరకు ఉద్యోగాల కోత తప్పని పరిస్థితి నెలకొంది. 

ట్రాక్టర్ల కొనుగోళ్లపై..

వ్యవసాయ రంగం కూడా పెద్ద ఆశాజనకంగా లేకపోవడంతో ట్రాక్టర్ల కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. వరదలు, కరవు వంటి సంక్షోభ పరిస్థితుల దెబ్బకు వ్యవసాయరంగం కుదేలైంది. సాధారణంగా ట్రాక్టర్ల విభాగంలో చాలా అరుదుగా కొనుగోళ్లు తగ్గుతాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా ట్రాక్టర్ల విక్రయాలు గత త్రైమాసికంలో 15శాతం పడిపోయాయి. ఎస్కార్ట్స్‌  విక్రయాలు కూడా ఈ సీజన్‌లో తగ్గుముఖం పట్టాయి. 

యాక్సెల్‌లోడ్‌ నిబంధన మార్పుతో..

ప్రభుత్వం కాలుష్యాన్ని తగ్గించేందుకు యాక్సెల్‌లోడ్‌ నిబంధనల్లో ఇటీవల మార్పులు తీసుకొచ్చింది. దీంతో వాణిజ్య వాహనాలు మోసే బరువు పరిమితి పెరిగింది. ఇది ఒక రకంగా ఇంధన వినియోగాన్ని తగ్గించి కాలుష్యాన్ని కట్టడి చేస్తుంది. కానీ, కొత్త వాహన కొనగోళ్లు (ట్రక్కులు, ట్యాంకర్లు వంటివి) గణనీయంగా తగ్గాయి. ఈ దెబ్బకు అశోక్‌లేలాండ్‌ పంత్‌నగర్‌ ప్లాంట్‌ను తొమ్మిది రోజులు మూసేయాల్సి వచ్చింది. టాటామోటార్స్‌ కూడా పంత్‌నగర్‌ ప్లాంట్‌ను కొన్నాళ్లు మూసేసింది. 

ఆఫర్లపై ఆశలు..

బీఎస్‌6 అమలుకు ముందు ఉన్న బీఎస్‌4 స్టాక్‌ను వదిలించుకోవడానికి కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తాయని వినియోగదారులు బలంగా విశ్వశిస్తున్నారు. దీంతో అప్పటి వరకు వేచి ఉండాలనే ధోరణి అవలంభిస్తున్నారు. గతంలో కూడా జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పుడు, బీఎస్‌3 వాహనల విక్రయాన్ని బ్యాన్‌ చేసినప్పుడు 2017లో కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

క్యాబ్‌ సేవల ఎఫెక్ట్‌..

ఆటోపరిశ్రమపై క్యాబ్‌ సేవల ఎఫెక్ట్‌ భారీగానే ఉంది. ఈ సేవలు విస్తరించే కొద్దీ .. సొంత వాహన కొనుగోళ్లపై ఆసక్తి తగ్గుతోంది. ఉబర్‌, ఓలా యాప్‌ల్లో గతంలో కేవలం కార్లను మాత్రమే బుక్‌ చేసుకొనే అవకాశం ఉంది. కానీ, ఇప్పుడు అవి ఆటోరిక్షాలు, మోటార్‌ బైక్‌లను బుక్‌ చేసుకొనే అవకాశం కల్పించేస్తున్నాయి. పెద్ద పట్టణాల్లో ట్రాఫిక్‌ పెరగడంతో ఉద్యోగాలు చేసే యువత చాలా సేపు డ్రైవింగ్‌లో సమయం వృథా చేసుకోవడానికి ఇష్టపడటంలేదు. దీంతో కార్ల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. పార్కింగ్‌ సమస్యలు, డ్రైవింగ్‌ నిబంధనలు కఠనతరం కావడం వంటివి కూడా ఆటో పరిశ్రమపై ప్రభావం చూపుతున్నాయి. మరోపక్క ప్రభుత్వాలు కూడా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వినియోగించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. చాలా నగరాల్లో ఇప్పటికే మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుతోంది. మరోవైపు దిల్లీలో మహిళలకు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో ఉచిత ప్రయాణాలను ఇవ్వడం వంటి చర్యలు కూడా వాహన రంగంపై  ప్రతికూల ప్రభావం చూపే అంశమే. 

విద్యుత్త వాహనాలకే ఊతం..

ఈ సారి ఆటోమొబైల్‌ పరిశ్రమ జీఎస్టీ తగ్గింపును ఆశించింది. కానీ, ప్రభుత్వం విద్యుత్తు వాహనాలకు మాత్రమే జీఎస్టీని తగ్గించింది. దీంతో చాలా మంది భవిష్యత్తులో ప్రభుత్వం కచ్చితంగా జీఎస్‌టీ తగ్గిస్తుందని నమ్ముతున్నారు. ఆ తగ్గింపు ప్రకటన కోసం వేచిచూస్తూ వాహన కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. 

ఆర్థిక సంక్షోభ భయాలు..

మరో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోందనే భయాలు మార్కెట్లను ఊపేస్తున్నాయి. దీంతో చాలా మంది వ్యయాలను తగ్గించుకొని పొదుపుబాట పడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగులు ఈ కేటగిరిలోకి వస్తారు. మరోపక్క రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకోకపోవడంతో ట్రక్కులు, కార్లకు డిమాండ్‌ తగ్గుతోంది. 

సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ నుంచి పోటీ.. 

గత ఐదేళ్ల నుంచి సెకండ్‌ హ్యాండ్‌ వాహన మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఇది కొత్త వాహనాల కొనుగోళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మరోపక్క కొత్త కాలుష్య నిబంధనల కారణంగా వాహన ధరలు పెరుగుతున్న సమయంలో సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ వినియోగదారులకు బలమైన ఎంపికగా మారింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.