Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144530
            [news_title_telugu_html] => 

మారిన వాట్సాప్‌ పేరు..! అందుకోసమేనా?

[news_title_telugu] => మారిన వాట్సాప్‌ పేరు..! అందుకోసమేనా? [news_title_english] => WhatsApp By Facebook comes to beta version [news_short_description] => ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు కేవలం వాట్సాప్‌గానే పరిగణిస్తున్న ఈ యాప్‌.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 01:39:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మారిన వాట్సాప్‌ పేరు..! అందుకోసమేనా? - WhatsApp By Facebook comes to beta version - EENADU
close

తాజా వార్తలు

మారిన వాట్సాప్‌ పేరు..! అందుకోసమేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు కేవలం వాట్సాప్‌గానే పరిగణిస్తున్న ఈ యాప్‌ ఇకపై ‘వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌’ అని యూజర్లకు కనిపించనుంది. ప్రస్తుతం బీటా (2.19.228) యూజర్లకు ఇది దర్శనమిస్తుండగా.. త్వరలో అందరికీ ఇదే పేరుతో కనిపించనుంది. అయితే, ఇది కేవలం పేరులో మార్పు తప్ప.. యాప్‌లో మరే ఇతర మార్పూలూ చోటుచేసుకోకపోవడం గమనార్హం.

2012లో ఇన్‌స్టాను, 2014లో వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసినప్పటికీ అవి ఆయా పేర్లతోనే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే పేరు మార్చాలని ఫేస్‌బుక్‌ నిర్ణయించింది. ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌ బై ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌ అని మారుస్తున్నట్లు పేర్కొంది. అందుకనుగుణంగానే వాట్సాప్‌లో తాజా మార్పు చోటుచేసుకుంది. బీటా యూజర్లు వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళితే..‘వాట్సాప్‌ బై ఫేస్‌బుక్‌’ అని కనిపిస్తుంది.

ఈ మార్పు వల్ల వాట్సాప్‌లో ఇప్పటికిప్పుడు వచ్చే మార్పు ఏదీ లేనప్పటికీ భవిష్యత్‌లో కీలక మార్పులకు ఫేస్‌బుక్‌ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌ యాప్‌లను ఇంటిగ్రేట్‌ చేయాలని జుకర్‌బర్గ్‌ నిర్ణయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనివల్ల కూడా ఆయా యాప్స్‌లో ఎలాంటి మార్పులూ జరగనప్పటికీ.. వీటిల్లో ఏ ఇతర ఖాతా లేకపోయినా మూడు సేవలనూ ఉపయోగించుకునే వీలుంటుంది. ఉదాహరణకు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ఉపయోగించే వ్యక్తి.. వాట్సాప్‌ ఖాతా మాత్రమే కలిగిన వ్యక్తితోనూ నేరుగా చాట్‌ చేసే అవకాశం ఉంటుంది. ఈ కీలకమార్పుకు శ్రీకారం చుట్టడంలో భాగంగానే ఫేస్‌బుక్‌ తాజా మార్పు చేపట్టినట్లు తెలుస్తోంది. 2020 నాటికి ఇంటిగ్రేషన్‌ జరిగే అవకాశం ఉంది.

మరోవైపు వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ఇటీవలే యూజర్ల సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్‌ లాక్‌ సదుపాయం వాట్సాప్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం బీటా యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. సదరు యూజర్‌ ఫింగర్‌ప్రింట్‌ లేకుండా ఇతరులెవరూ వాట్సాప్‌ చూడకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.