Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144599
            [news_title_telugu_html] => 

హువావేపై నిషేధం: అమెరికా కీలక నిర్ణయం

[news_title_telugu] => హువావేపై నిషేధం: అమెరికా కీలక నిర్ణయం [news_title_english] => US to delay for 90 days ban on Huawei to buy supplies from US firms [news_short_description] => చైనాకు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం హువావేకు ఊరట కలిగించే అంశం. ఆ సంస్థపై అమెరికా విధించిన 90రోజుల తాత్కాలిక నిషేధాన్ని మరో [news_tags_keywords] => Huawei,America,china [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 18:26:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హువావేపై నిషేధం: అమెరికా కీలక నిర్ణయం - US to delay for 90 days ban on Huawei to buy supplies from US firms - EENADU
close

తాజా వార్తలు

హువావేపై నిషేధం: అమెరికా కీలక నిర్ణయం

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనాకు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం హువావేకు ఊరట కలిగించే అంశం. ఆ సంస్థపై అమెరికా విధించిన నిషేధాన్ని 90రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు మరో 90రోజుల పాటు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు యూఎస్‌ కామర్స్‌ సెక్రటరీ విల్బర్‌ రోస్‌ ప్రకటించారు. దీంతో హువావే అమెరికా కంపెనీలతో క్రయవిక్రయాలు జరపవచ్చు. 

‘హువావేతో వ్యాపార లావాదేవీలకు యూఎస్‌ టెలికాం కంపెనీలకు మరో 90రోజులు వెసులుబాటు ఇస్తున్నాం. పలు కంపెనీలు హువావే టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తున్నాయి. అందుకే అవి సొంతంగా సౌకర్యాలు కల్పించుకునే వరకూ వాటికి కొద్దిగా వెసులుబాటు కల్పిస్తున్నాం. అయితే, ప్రత్యేకంగా లైసెన్స్‌లకు మాత్రం అనుమతులు ఇవ్వడంలేదు’ అని రోస్‌ పేర్కొన్నారు.

విదేశీ శత్రువుల నుంచి దేశంలోని కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు ముప్పు ఉందంటూ అమెరికా అధ్యక్షుడు నేషనల్‌ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చైనా టెలికాం దిగ్గజం హువావేపై నిషేధం విధించారు. ఆ సంస్థ చైనా కోసం గూఢచర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎటువంటి సాంకేతికతను కొనుగోలు చేయకూడదని ఆంక్షలు విధించారు. ఆ తర్వాత ఆ ఆంక్షలను 90రోజులు సడలించగా, ఇప్పుడు మరో 90రోజుల పాటు నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు. దీంతో హువావేతో అమెరికా కంపెనీలు వ్యాపారలావాదేవీలను నిర్వహించుకోవచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.