Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145056
            [news_title_telugu_html] => మార్కెట్లోకి సరికొత్త గ్రాండ్‌ ఐ10 నియోస్‌
            [news_title_telugu] => మార్కెట్లోకి సరికొత్త గ్రాండ్‌ ఐ10 నియోస్‌
            [news_title_english] => 2019 Hyundai Grand i10 Nios Launched In India
            [news_short_description] => హ్యుందాయ్‌ మోటార్స్‌ మార్కెట్లోకి సరికొత్త ఐ10 నియోస్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు  నిర్ణయించారు. పెట్రోల్‌ 

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-20 14:46:12
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
మార్కెట్లోకి సరికొత్త గ్రాండ్‌ ఐ10 నియోస్‌ - 2019 Hyundai Grand i10 Nios Launched In India - EENADU
close

తాజా వార్తలు

మార్కెట్లోకి సరికొత్త గ్రాండ్‌ ఐ10 నియోస్‌

దిల్లీ: హ్యుందాయ్‌ మోటార్స్‌ మార్కెట్లోకి సరికొత్త ఐ10 నియోస్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.7.99 లక్షల వరకు  నిర్ణయించారు. పెట్రోల్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.4.99లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ.6.70లక్షలుగా ఉంది. దీనిలో టాప్‌ఎండ్‌ ధర రూ.7.99లక్షలు(దిల్లీ ఎక్స్‌షోరూం). ఈ మోడల్‌ కారును త్వరలోనే యూరప్‌ మార్కెట్లో కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్‌ను హ్యుందాయ్‌ స్వీకరిస్తోంది. ప్రస్తుత మోడల్‌ గ్రాండ్‌ ఐ10తోపాటు సరికొత్త మోడల్‌ కూడా మార్కెట్లో అందుబాటులోకి ఉంటుంది. భారత్‌ మార్కెట్‌ అవసరాలకు తగినట్లు ఈ కారును డిజైన్‌ చేసినట్లు కంపెనీ పేర్కొంది. వీటిల్లో ఫీచర్లను బట్టి ఎరా, మాగ్నా, స్పోర్ట్స్‌, ఆస్టా మోడళ్లు ఉన్నాయి. 
ఈ కారులో సరికొత్త హెడ్‌ల్యాంప్స్‌, ప్రొజెక్టర్‌ ల్యాంప్స్‌ ఉన్నాయి. ఫ్రంట్‌ గ్రిల్‌ ఆకారం కూడా సరికొత్తగా ఉంది. ఇంటీరియర్‌ను కూడా పూర్తిగా మార్చేశారు. డ్యాష్‌బోర్డులో సరికొత్త 8అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ ఉంది. దీనికి స్మార్ట్‌ ఫోన్లను అనుసంధానించుకోవచ్చు. ఇక స్టీరింగ్‌, ఏసీ వెంట్స్‌ను వెన్యూమోడల్‌ నుంచి తెచ్చుకున్నారు. వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జర్‌, ఆటోమేటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, రియర్‌ ఏసీ సౌకర్యాలను కల్పించింది. 
ఈ కారులో కూడా 1.2 డీజిల్‌, పెట్రోల్‌ ఇంజిన్లనే హ్యుందాయ్‌ కొనసాగించింది. పెట్రోల్‌ ఇంజిన్‌ 82 బీహెచ్‌పీ, డీజిల్‌ ఇంజిన్‌ 74బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తాయి. రెండిట్లోనూ 5స్పీడ్‌ మ్యాన్యూవల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్లను అమర్చింది. పెట్రోల్‌ మాన్యూవల్‌ లీటర్‌కు 20.7కిలోమీటర్లు, ఆటోమేటిక్‌ 20.2 కిలోమీటర్ల మేరకు మైలేజీ ఇస్తుంది. డీజిల్‌ రకంలో రెండు వేరియంట్లు 26.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఈ సరికొత్త కారు మొత్తం ఆరు రంగుల్లో లభిస్తుంది. డ్యూయల్‌ టోన్‌ ఆప్షన్‌ కూడా హ్యుందాయ్‌ కల్పించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.