Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145041
            [news_title_telugu_html] => 

సీజీ పవర్‌లో అవకతవకలు..!

[news_title_telugu] => సీజీ పవర్‌లో అవకతవకలు..! [news_title_english] => CG Power shares slump after suspect transactions found [news_short_description] => గౌతమ్‌ థాపర్‌ ప్రమోట్‌ చేస్తున్న సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌లో ఆర్థిక అవక తవకలు జరిగినట్లు బోర్డు గుర్తించింది. ఈ విషయాన్ని బోర్డు నేడు ఎక్స్‌ఛేంజి ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో ఈ కంపెనీ [news_tags_keywords] => CG Power,bse,nse,yesbank [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:18:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సీజీ పవర్‌లో అవకతవకలు..! - CG Power shares slump after suspect transactions found - EENADU
close

తాజా వార్తలు

సీజీ పవర్‌లో అవకతవకలు..!

 భారీగా పతనమైన షేరు

ముంబయి: గౌతమ్‌ థాపర్‌ ప్రమోట్‌ చేస్తున్న సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు బోర్డు గుర్తించింది. ఈ విషయాన్ని బోర్డు నేడు ఎక్స్‌ఛేంజి ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో ఈ కంపెనీ షేరు మార్కెట్లో నేడు ఒక్కరోజే దాదాపు 20శాతం విలువ కోల్పోయింది. గత జనవరి నుంచి చూస్తే ఈ షేరు ధర దాదాపు 67.6శాతం కుంగింది. 
బోర్డు నిర్వహించిన స్వతంత్ర దర్యాప్తులో కంపెనీ, గ్రూపు అప్పులను ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపినట్లు గుర్తించింది. వీటి విలువ రూ.వందల కోట్లల్లోనే ఉంటుందని పేర్కొంది. 
దీంతోపాటు  కంపెనీకి చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులు చేసిన అప్పులకు కంపెనీ ఆస్తులను ఎంటువంటి అనుమతులు లేకుండా తాకట్టు కింద పెట్టారని పేర్కొన్నారు. వీరిలో కంపెనీ నాన్‌ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్లు, మరికొందరు ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొంది. ఈ నిధులను వివిధ మార్గాల్లోకి మళ్లించినట్లు బోర్డు పేర్కొంది. 
చాలా మంది రుణదాతలు సీజీ పవర్‌లోని ప్రమోటర్ల షేర్లను తాకట్టు నుంచి జప్తు చేసుకొన్నట్లు తేలింది. జూన్‌30 నాటికి ప్రమోటర్లకు కంపెనీలో వాటాలు ఏమీ లేకుండాపోయాయి. యస్‌బ్యాంక్‌ కూడా 12.79శాతం షేర్లను జూన్‌ 30 నాటికి జప్తు చేసుకొంది. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచివల్‌ ఫండ్స్‌, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌,  ఎల్‌ఐసీ తదితర సంస్థలు కూడా  జప్తు చేసుకున్న రుణదాతల్లో ఉన్నాయి. ఫలితం నేటి ఉదయం ట్రేడింగ్‌లో యస్‌బ్యాంక్‌ షేరు కూడా 6శాతం వరకు కుంగింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.