Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145578
            [news_title_telugu_html] => 

బిస్కెట్లకూ తప్పని ఆర్థిక ముప్పు

[news_title_telugu] => బిస్కెట్లకూ తప్పని ఆర్థిక ముప్పు [news_title_english] => Parle May Lay Off Up To 10000 workers due to demand reduction [news_short_description] => ఆర్థిక రంగంలో మందగమనం బిస్కెట్ల తయారీ కంపెనీలపైనా ప్రభావం చూపుతోంది. దేశీయంగా అతిపెద్ద బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే భారీ... [news_tags_keywords] => Biscuits,Parle,Britannia,GST [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 14:23:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బిస్కెట్లకూ తప్పని ఆర్థిక ముప్పు - Parle May Lay Off Up To 10000 workers due to demand reduction - EENADU
close

తాజా వార్తలు

బిస్కెట్లకూ తప్పని ఆర్థిక ముప్పు

బెంగళూరు: ఆర్థిక రంగంలో మందగమనం బిస్కెట్ల తయారీ కంపెనీలపైనా ప్రభావం చూపుతోంది. దేశీయంగా అతిపెద్ద బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే భారీ సంఖ్యలో కార్మికులను తొలగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విక్రయాలు భారీగా పడిపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. దేశీయంగా ఆటోమొబైల్‌, రిటైల్‌తో పాటు దాదాపు అన్ని రంగాలు నేల చూపులు చూస్తున్న వేళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కంపెనీలు ఉత్పత్తి, ఉద్యోగుల నియామకాలను తగ్గింపు దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పార్లే సైతం అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై సంస్థ ప్రతినిధి మయాంక్‌ షా మాట్లాడుతూ..‘‘విక్రయాల్లో తగ్గుదల నమోదవుతున్న క్రమంలో జీఎస్టీపై కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాం. ఒకవేళ ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే దాదాపు 8 వేల నుంచి 10 వేల మంది కార్మికుల్ని తొలగించడం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు’’ అని ప్రస్తుత పరిస్థితుల్ని వివరించారు. పార్లే కంపెనీ మొనాకో, పార్లే-జీ, మేరీ బ్రాండ్ల పేరిట బిస్కెట్లను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సంస్థలో దాదాపు లక్ష మంది కార్మికులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 10 సొంత ఉత్పత్తి కేంద్రాలతో పాటు, 125 థర్డ్‌ పార్టీ బిస్కెట్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.  

ప్రభుత్వం నుంచి ఉద్దీపన చర్యలను ఆశిస్తున్న కంపెనీలు ఉద్యోగుల కోత, ఉత్పత్తి తగ్గింపు దిశగా చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి. తాజా పార్లే అంశం కూడా అందులో భాగమేనని అర్థమవుతోంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రభావితమైన బిస్కెట్‌ కంపెనీల్లో పార్లేతో పాటు బ్రిటానియా కూడా ఉండడం గమనార్హం. గత నెల ఆ సంస్థ ఎండీ వరుణ్‌ బెర్రీ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులు రూ.5 బిస్కెట్‌ ప్యాకెట్‌లు కొనడానికి కూడా సంకోచిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

జీఎస్టీ రాక ముందు కేజీ బిస్కెట్ల ధర రూ.100 కంటే తక్కువ ఉంటే 12శాతం పన్ను విధించే వారు. అయితే జీఎస్టీ అమలు తర్వాత ప్రీమియం బిస్కెట్లను 12శాతం, తక్కువ ధర బిస్కెట్లను 5శాతం శ్లాబు పరిధిలోకి తెస్తారని పరిశ్రమ వర్గాలు ఊహించాయి. కానీ, అందుకు భిన్నంగా ప్రభుత్వం బిస్కెట్‌ సంబంధిత ఉత్పత్తులన్నింటినీ 18శాతం శ్లాబులోకి తీసుకొచ్చింది. దీంతో బిస్కెట్ల తయారీ పరిశ్రమలు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో పార్లే తమ ఉత్పత్తులపై 5శాతం ధరల్ని పెంచింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.