Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145661
            [news_title_telugu_html] => విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్తకారు: ఫీచర్స్‌ తెలుసా!
            [news_title_telugu] => విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్తకారు: ఫీచర్స్‌ తెలుసా!
            [news_title_english] => BMW launches new 3 series sedan priced Rs 41 lakh onwards
            [news_short_description] => జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దేశీయ విపణిలో సెడాన్‌ 3 సిరీస్‌లో సరికొత్త వెర్షన్‌ను బుధవారం ఆవిష్కరించింది. గత వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త కారు బరువు 55 కిలోలు తక్కువ ఉండగా లోపలి వైశాల్యం పెరిగింది....

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 00:37:21
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్తకారు: ఫీచర్స్‌ తెలుసా! - BMW launches new 3 series sedan priced Rs 41 lakh onwards - EENADU
close

తాజా వార్తలు

విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్తకారు: ఫీచర్స్‌ తెలుసా!

గురుగ్రామ్‌: జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దేశీయ విపణిలో సెడాన్‌ 3 సిరీస్‌లో సరికొత్త వెర్షన్‌ను బుధవారం ఆవిష్కరించింది. గత వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త కారు బరువు 55 కిలోలు తక్కువ ఉండగా లోపలి వైశాల్యం పెరిగింది. ధర రూ.41.4- 47.9 లక్షల మధ్య ఉంది. బీఎండబ్ల్యూ 330ఐ, బీఎండబ్ల్యూ 320డీ ఇంజిన్లతో ఈ వెర్షన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. స్పోర్ట్‌, లగ్జరీ లైన్‌, ఎం స్పోర్ట్‌ వేరియంట్లలో 3 సిరీస్‌ లభిస్తోంది. ఎం స్పోర్ట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కాగా మిగతా వాటిలో డీజిల్‌ ఇంజిన్లు ఉన్నాయి. డీజిల్‌ కార్ల ధర రూ.41.4 లక్షలు, రూ.46.9 లక్షలు కాగా పెట్రోల్‌ వెర్షన్‌ ధర రూ.47.9 లక్షలుగా నిర్ణయించారు.

బీఎండబ్ల్యూకు 3 సిరీస్‌ ఆత్మలాంటిదని ఆ సంస్థ భారత అధ్యక్షుడు, సీఈవో రుద్రతేజ్‌ సింగ్‌ తెలిపారు. ఇది డ్రైవర్‌, రహదారి, మెషిన్‌ మధ్య అంతులేని సామరస్యం కలిగిస్తుందన్నారు. ‘అంతర్జాతీయ, భారత విపణిలో 3 సిరీస్‌ వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. భారత్‌లో మేం విక్రయిస్తున్న ప్రతి మూడు కార్లలో ఒకటి 3 సిరీసే’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సరికొత్త కారులో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, ఆపిల్‌ కార్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్‌, 12.3 అంగుళాల తాకేతెర, భద్రత కోసం 6 ఎయిర్‌ బ్యాగులు ఉన్నాయి. 3 సిరీస్‌ కార్లను చెన్నై ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.