Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145710
            [news_title_telugu_html] => వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీ.. భారత్‌లోనే ఫస్ట్‌!
            [news_title_telugu] => వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీ.. భారత్‌లోనే ఫస్ట్‌!
            [news_title_english] => OnePlus to launch smart TVs in September to be available in India first
            [news_short_description] => ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న చైనాకు చెందిన వన్‌ప్లస్‌ సంస్థ స్మార్ట్‌టీవీల మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు..

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 00:36:24
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీ.. భారత్‌లోనే ఫస్ట్‌! - OnePlus to launch smart TVs in September to be available in India first - EENADU
close

తాజా వార్తలు

వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీ.. భారత్‌లోనే ఫస్ట్‌!

న్యూదిల్లీ: ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న చైనాకు చెందిన వన్‌ప్లస్‌ సంస్థ స్మార్ట్‌టీవీల మార్కెట్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు తీసుకొస్తారు? ఎక్కడ తొలుత విడుదల చేస్తారన్న దానిపై సమాచారం లేదు. తాజాగా ఆ కంపెనీఈ సీఈవో పీటే లౌ దీనిపై స్పష్టతనిచ్చారు. తొలి వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీని సెప్టెంబర్‌లో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. పైగా తొలుత భారత్‌లోనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వన్‌ప్లస్‌ ఫోరంలో ఈ విషయాన్ని పోస్ట్‌ చేశారు. అయితే, స్మార్ట్‌టీవీకి సంబంధించి ధర గానీ, ఇతర వివరాలు గానీ వెల్లడించలేదు.

స్మార్ట్‌టీవీ ప్రాజెక్ట్‌పై గత రెండేళ్లుగా పనిచేస్తున్నట్లు లౌ తెలిపారు. ఈ విభాగంలో విజయం సాధించేందుకు ఒక మార్కెట్‌పై పూర్తి దృష్టి సారించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటికే భారత్‌లో కంటెంట్‌ ప్రొవైడర్లతో సత్సంబంధాలు ఉన్నాయని, తమతో భాగస్వామ్యానికి వారు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. తమ పరస్పర భాగస్వామ్యంతో యూజర్లకు గొప్ప కంటెంట్‌ను అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా, యూరప్‌, చైనాలోనూ టీవీలను తీసుకురావడంలో భాగంగా అక్కడి స్థానిక కంటెంట్‌ ప్రొవైడర్లతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్మార్ట్‌టీవీ విభాగంలో అగ్రగామిగా నిలవాలన్నదే తమ ధ్యేయమని వివరించారు. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ తయారీ విభాగంలో ఉన్న షావోమీ, శామ్‌సంగ్‌, ఎల్‌జీ, మైక్రోమ్యాక్స్‌ కంపెనీలు టీవీలను తయారుచేస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలకు ఈ విభాగంలో వన్‌ప్లస్‌ గట్టి పోటీ కానుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.