close

తాజా వార్తలు

కియా సెల్టోస్‌ మార్కెట్లోకి వచ్చేసిందోచ్..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కియా సిల్టోస్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర రూ.9.69 లక్షల నుంచి అత్యధికంగా 15.99 లక్షల వరకు ఉంది. ఈ కారును తొలిసారి 2018 ఆటోషోలో ప్రదర్శించారు. భారత్‌లో ఈ కంపెనీ 2 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో దీనిని తయారు చేస్తున్నారు. ఇక్కడి తయారైన కార్లు విదేశాలకు ఎగుమతి కానున్నాయి.
16 వేరియంట్లలో..

ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌ కలిపి మొత్తం 16 వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. దీంతో వినియోగదారులకు కార్ల ఎంపికకు విస్తృతమైన అవకాశం కల్పించినట్లైందని కంపెనీ వెల్లడించింది. దీనిలో రెండు పెట్రోల్‌, ఒక డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నాయి. కారులో మొదటి నుంచి బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన ఇంజిన్‌ను అమర్చారు. 
* 1.4 లీటర్‌ టర్బోపెట్రోల్‌ మోటార్‌ ఇంజిన్‌ 138 బీహెచ్‌పీ శక్తి, 242 ఎన్‌ఎం టార్క్‌ విడుదల చేస్తుంది. 7స్పీడ్‌ మాన్యూవల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లను అమర్చారు. 
* 1.5ఎన్‌ఏ పెట్రోల్‌ ఇంజిన్‌ 113 బీహెచ్‌పీ శక్తి, 144 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 6 స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌కు ఐవీటీ టెక్నాలజీని అనుసంధానించారు. 
* 1.5 లీటర్‌ వీజీటీ డిజల్‌ ఇంజిన్‌ 113 బీహెచ్‌పీ శక్తిని, 250 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి 6 స్పీడ్‌ మాన్యువల్‌, 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ను అమర్చారు.

ఈ కారును టెక్‌ లైన్‌, జీటీ లైన్‌ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో లైన్‌లో వినియోగదారులకు ఈ,కె,కె (ప్లస్‌), ఎక్స్‌, ఎక్స్‌(ప్లస్‌) రకాలు అందుబాటులో ఉంటాయి. ప్రీమియం లుక్స్‌తో టెక్‌లైన్‌, స్పోర్టీ లుక్‌తో జీటీ లైన్‌ను తయరు చేశారు. 

ఫీచర్లు అదుర్స్‌..

కియా సెల్టోస్‌ను ఫీచర్లతో దట్టించారు. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌కు జ్యువెల్‌ ఎఫెక్ట్‌ ఉంది. 17 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్‌ ఓఆర్‌ఎం, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌లో యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో ఫీచర్లు ఉన్నాయి. 8 బోస్‌ సౌండ్‌ సిస్టమ్‌ స్పీకర్లు, మూడ్‌ లైటింగ్‌, వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జింగ్‌, ఎలక్ట్రిక్‌ సన్‌ రూఫ్‌, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్‌ డ్రైవర్‌ సీట్‌, 360 కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్‌, ఈబీడీ, ఫ్రంట్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సర్స్‌, ఈఎస్‌పీ, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, బ్లైండ్‌ వ్యూ మానిటర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు కోసం అత్యంత బలమైన ఉక్కును ఉపయోగించారు. 

యూవీవో కనెక్టివిటీ..
ఈ కారులో యూవీవో కనెక్టివిటీ ఫీచర్‌ ఉంది. దీనిద్వారా 37 స్మార్ట్‌ ఫీచర్లను అనుసంధానించుకోవచ్చు. జియో ఫెన్సింగ్‌, రిమోట్‌ ఏసీ కంట్రోల్‌తో పాటు ఇంజిన్‌ స్టార్ట్‌, నేవిగేషన్‌, టైర్‌ ఒత్తిడిని పర్యవేక్షించే వ్యవస్థలు ఉన్నాయి. దీంతోపాటు నార్మల్‌, ఎకో, స్పోర్ట్‌ అనే డ్రైవింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. ఇక బురదలో, మంచులో వెళ్లేటప్పుడు ఉపయోగపడేలా ట్రాక్షన్‌ కంట్రోల్‌ వ్యవస్థలు ఉన్నాయి. 

భారీ నెట్‌వర్క్‌..

కియా భారత్‌లో ప్రణాళికా ప్రకారం అడుగుపెట్టింది. మొత్తం 160 పట్టణాల్లో 265 టచ్‌పాయింట్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో 206 సేల్‌  పాయింట్లు ఉన్నాయి. బుకింగ్స్‌ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 23వేల ఆర్డర్లను అందుకొంది. 2021వరకు ప్రతి ఆరు నెలలకు ఒక కొత్తకారును భారత మార్కెట్లో విడుదల చేయాలని కియా లక్ష్యంగా పెట్టుకొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.