Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000029
            [news_title_telugu_html] => వీడియో లవర్స్‌ కోసం మోటో ‘వన్‌యాక్షన్‌’
            [news_title_telugu] => వీడియో లవర్స్‌ కోసం మోటో ‘వన్‌యాక్షన్‌’
            [news_title_english] => Motorola One Action Launched in India
            [news_short_description] => ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలో మరో కొత్త మొబైల్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. వన్‌ సిరీస్‌కు కొనసాగింపుగా.. మోటోరొలా వన్‌ యాక్షన్‌....

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-24 00:15:00
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
వీడియో లవర్స్‌ కోసం మోటో ‘వన్‌యాక్షన్‌’ - Motorola One Action Launched in India - EENADU
close

తాజా వార్తలు

వీడియో లవర్స్‌ కోసం మోటో ‘వన్‌యాక్షన్‌’

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరొలో మరో కొత్త మొబైల్‌ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. వన్‌ సిరీస్‌కు కొనసాగింపుగా.. మోటోరొలా వన్‌ యాక్షన్‌ మోడల్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా వీడియోలు క్రియేట్‌ చేసేవారిని దృష్టిలో పెట్టుకుని కొత్త సదుపాయాలతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. దీనిలోని 117 డిగ్రీల అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ ద్వారా డీటెయిల్డ్‌ వీడియోలను రికార్డ్‌ చేయొచ్చు. సులభంగా చెప్పాలంటే యాక్షన్‌ కెమెరాలా ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను నిలువుగా (వెర్టికల్‌) ఉంచి కూడా అడ్డంగా (ల్యాండ్‌స్కేప్‌) వీడియోలను రికార్డ్‌ చేయొచ్చు. 4జీబీ/ 128జీవీ వేరియంట్‌లో వస్తున్న ఈ ఫోన్‌ ధరను రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. ఆగస్టు 30న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని విక్రయించనున్నారు. లాంచ్‌ ఆఫర్‌ కింద రూ.2,200 విలువ చేసే జియో ఇన్‌స్టంట్‌ కూపన్లను అందించనున్నారు. 125జీబీ అదనపు 4జీ డేటాను ఇవ్వనున్నారు. డెనిమ్‌ బ్లూ, పెరల్‌ వైట్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యం కానుంది.

ఇతర స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ వన్‌  ప్రొగ్రామ్‌ కింద వస్తున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 9.0 పై ఓఎస్‌తో పనిచేయనుంది. ఆండ్రాయిడ్‌ 10, 11 వెర్షన్ల వరకు అప్‌డేట్లు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే 21:9 నిష్పత్తిలో సినిమా విజన్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో శామ్‌సంగ్‌ ఆక్టాకోర్‌ ఎగ్జినోస్‌ 9609 ప్రాసెసర్‌ను వినియోగించారు. వెనుక వైపు 16+12+5 ఎంపీల సెన్సార్లతో ట్రిపుల్‌ కెమెరాలను, ముందు వైపు 12 మెగాపిక్సల్‌ కెమెరాను అమర్చారు. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీని.. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. టైప్‌-సి పోర్ట్‌, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్‌ 5.0, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో పాటు దాదాపు అన్ని సెన్సార్లు ఉన్నాయి. ఇందులోని 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 10W ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గత వారం విడుదలైన వివిధ దేశాల్లో దాదాపు రూ.20వేలు ఉండగా.. భారత్‌కొచ్చే సరికి ఇతర కంపెనీల నుంచి ఉన్న పోటీ దృష్ట్యా ధరను తగ్గించినట్లు తెలుస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.