Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000032
            [news_title_telugu_html] => 

ఆ వాహనాలను నిషేధించబోం: గడ్కరీ

[news_title_telugu] => ఆ వాహనాలను నిషేధించబోం: గడ్కరీ [news_title_english] => We Dont ban petrol diesel vehicles says Nitin Gadkari [news_short_description] => ఆటోమొబైల్‌ రంగంలో ప్రభుత్వం నూతన పోకడలకు పెద్ద పీట వేయడమనేది ప్రజలు స్వీకరించే తీరును బట్టి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమొబైల్‌ రంగానికి ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని, పెట్రోలు వాహనాలను అంత త్వరగా నిషేధించబోమని స్పష్టం చేశారు. హీరో సంస్థ శుక్రవారం నిర్వహించిన చేసిన మైండ్‌ మైన్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. [news_tags_keywords] => Nitin Gadkari, petrol diesel vehicles, Electric Vehicles [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 00:15:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ వాహనాలను నిషేధించబోం: గడ్కరీ - We Dont ban petrol diesel vehicles says Nitin Gadkari - EENADU
close

తాజా వార్తలు

ఆ వాహనాలను నిషేధించబోం: గడ్కరీ

దిల్లీ: ఆటో మొబైల్‌ రంగంలో ప్రభుత్వం నూతన పోకడలకు పెద్ద పీట వేయడమనేది ప్రజలు స్వీకరించే తీరును బట్టి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఆటోమొబైల్‌ రంగానికి ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని, పెట్రోలు వాహనాలను అంత త్వరగా నిషేధించబోమని స్పష్టం చేశారు. హీరో సంస్థ శుక్రవారం నిర్వహించిన చేసిన మైండ్‌ మైన్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎలక్ట్రానిక్‌ వాహనాలకు మారే విషయంలో తమ నిర్ణయాలను ప్రభుత్వ పెద్దలు మరోసారి విశ్లేషించుకోవాలని సదస్సుకు హాజరైన నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే సరస్వత్‌ అన్నారు. 

‘‘ఆటోమొబైల్‌ రంగంలో బీఎస్‌-6 ఇంధన ప్రమాణాలు గల వాహనాల తయారీ కోసం రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒకవేళ బీఎస్‌-6 ప్రమాణాల కోసం ప్రభుత్వం నిర్దిష్ట గడువు విధిస్తే ఏమవుతుంది? ఆలోపు నిర్దిష్ట ప్రమాణాలతో అభివృద్ధి చేయడం కష్టం కాబట్టి పెట్టిన పెట్టుబడి మొత్తం నిరర్థకమైనట్లే కదా’’ అని అన్నారు.

దేశంలో కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు 2023-25 మధ్య కల్లా దశల వారీగా పెట్రోలుతో నడిచే ద్విచక్ర, త్రిచక్ర వాహనాల స్థానంలో ఎలక్ట్రానిక్‌ వాహనాలు ప్రవేశపెట్టాలని గత జూన్‌లో నీతి ఆయోగ్‌ గడువు విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆటోమొబైల్‌ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే, వాహనాల సాంకేతికత మార్పు విషయంలో ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటుందని గతంలో మంత్రి చెప్పిన విషయాన్ని సరస్వత్‌ గుర్తు చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.