Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000458
            [news_title_telugu_html] => 

‘విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌’

[news_title_telugu] => ‘విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌’ [news_title_english] => FMs steps will strengthen Indias position as global investment destination [news_short_description] => ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధిని వేగిరం చేయడానికి భారత్‌ తీసుకున్న నిర్ణయాలను అమెరికా వ్యాపార వర్గాలు స్వాగతించాయి. శుక్రవారం నాటి మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన............ [news_tags_keywords] => America,India,USIBC,USISPF [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 10:41:03 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌’ - FMs steps will strengthen Indias position as global investment destination - EENADU
close

తాజా వార్తలు

‘విదేశీ పెట్టుబడులకు కేంద్రంగా భారత్‌’

భారత్‌ ఉద్దీపన చర్యలను స్వాగతించిన యూఎస్‌ వాణిజ్య వర్గాలు

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధిని వేగిరం చేయడానికి భారత్‌ తీసుకున్న నిర్ణయాలను అమెరికా వ్యాపార వర్గాలు స్వాగతించాయి. శుక్రవారం నాటి మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన పలు ఉద్దీపన కార్యక్రమాలు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశం మెండుగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో భారత్‌ అంతర్జాతీయంగా పెట్టుబడుల కేంద్రంగా కొనసాగనుందని తెలిపారు. ‘‘నిర్మలా సీతారామన్‌, భారత ప్రభుత్వం తీసుకున్న పలు ఉద్దీపన చర్యలను మేం స్వాగతిస్తున్నాం. దీని ద్వారా వృద్ధి రేటు గాడిన పడి ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది’’ అని యూఎస్‌-ఇండియా వాణిజ్య మండలి అధ్యక్షురాలు నిశా దేశాయ్‌ బిశ్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో విదేశీ మదుపర్లకు సానుకూల సంకేతాలు పంపారని తెలిపారు. దీంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన పలు నిర్ణయాలను గుర్తుచేశారు.

భారత ప్రభుత్వం తీసుకున్న నిర్మాణాత్మక చర్యలు సులభతర వాణిజ్యానికి దోహదం చేస్తాయని భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌) ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో భారత్‌లో విదేశీ పెట్టుబడులు పెరుగుతాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ మెరుగైన అవకాశాలు ఉంటాయని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా మందగమనం కనిపిస్తున్న తరుణంలో వృద్ధి చక్రాల వేగం పెంచడానికి ప్రభుత్వం కీలక అడుగు వేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ప్రత్యేక మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆ దిశగా పలు నిర్ణయాలు ప్రకటించారు. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల(ఎఫ్‌పీఐ)పై విధించిన అధిక పన్నులను వెనక్కి తీసుకోవడం నుంచి.. అంకుర సంస్థలకు ఏంజెల్‌ పన్నును ఉపసంహరించడం దాకా పలు తాయిలాలిచ్చారు. ప్రభుత్వ ఉద్దీపన చర్యలను కార్పొరేట్‌, పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.