Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000529
            [news_title_telugu_html] => 

ఒకే దేశం..ఒకే పన్ను.. జైట్లీ..

[news_title_telugu] => ఒకే దేశం..ఒకే పన్ను.. జైట్లీ.. [news_title_english] => jaitly behind gst [news_short_description] => 2017 జులై దేశంలో విప్లవాత్మకమైన పన్ను విధానాన్ని ప్రారంభించారు. జీఎస్టీ (వస్తు, వినియోగ సేవల పన్ను) తో దేశం మొత్తం ఒకే పన్ను వ్యవస్థ కిందకు వచ్చింది. ... [news_tags_keywords] => gst,arun jaitly,arun jaitley demise [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:17:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఒకే దేశం..ఒకే పన్ను.. జైట్లీ.. - jaitly behind gst - EENADU
close

తాజా వార్తలు

ఒకే దేశం..ఒకే పన్ను.. జైట్లీ..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం : 2017 జులై దేశంలో విప్లవాత్మకమైన పన్ను విధానాన్ని ప్రారంభించారు. జీఎస్టీ (వస్తు, వినియోగ సేవల పన్ను) తో దేశం మొత్తం ఒకే పన్ను వ్యవస్థ కిందకు వచ్చింది. ఇంత పెద్ద దేశంలో ఇలాంటి పన్నుల వ్యవస్థను ప్రవేశపెట్టడం చాలా కష్టతరం. అయితే అప్పటి కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీ ఎంతో చాకచక్యంగా దీన్ని అమలు చేశారు. 

జీఎస్టీకి ముందు..
జీఎస్టీకి రాకముందు అనేక పన్నులుండేవి. తయారీదారు నుంచి వినియోగదారునికి చేరేవరకు ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌, సీఎస్టీ, స్థానికపన్నులు..కలిసి పన్నుల వ్యవస్థ అయోమయంగా ఉండేది. గతంలో యూపీఏ హయాములోనే పన్నుల వ్యవస్థను ఏకీకృతం చేయాలని భావించినా అడుగు ముందుకు పడలేదు. అనంతరం 2014లో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడంతో జీఎస్టీని ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ ప్రారంభమైంది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి ఈ పనిని అప్పగించారు. దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన సఫలీకృతమయ్యారు. దీంతో అన్నీ పన్ను వ్యవస్థలు రద్దై జీఎస్టీ అమలులోకి వచ్చింది. 

సరకు రవాణా వేగవంతం
జీఎస్టీ అమలులోకి రాకముందు ప్రతి రాష్ట్ర సరిహద్దుల్లో వాణిజ్య శాఖ చెక్‌పోస్టులుండేవి. జీఎస్టీ విధానంలో భాగంగా ఈ-వే బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో లారీయజమానులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవడం ద్వారా రవాణా మరింత వేగవంతమైంది. ఉదా ముంబయి నుంచి ఏపీలోని తిరుపతికి గతంలో సరకు లారీ ప్రయాణించేందుకు వివిధ వాణిజ్య చెక్‌పోస్టుల నుంచి దాటుకుంటే వచ్చేసరికి ఐదు రోజుల సమయం పట్టేది. జీఎస్టీ వచ్చిన అనంతరం ప్రయాణ సమయానికి కేవలం రెండు రోజులు మాత్రమే పడుతుండటం విశేషం.
వసూళ్లు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం జీఎస్టీలో నాలుగు శ్లాబ్‌లు ఉన్నాయి. రానున్న కాలంలో 12 శాతం, 18 శాతం ఉన్న శ్లాబ్‌లను కూడా ఒకటిగా చేయనున్నామని జైట్లీ గతంలో తెలిపారు.  ఆయన ఆశించిన తీరులోనే జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతుండటం గమనార్హం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.