Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001011
            [news_title_telugu_html] => 

ప్రమాదంలో రూ.13లక్షల కోట్లు..!

[news_title_telugu] => ప్రమాదంలో రూ.13లక్షల కోట్లు..! [news_title_english] => 195 firms owe Rs 13 trillion to lenders borrowings exceed market cap [news_short_description] => ఇటీవల స్టాక్‌ మార్కెట్లో చోటుచేసుకొన్న ప్రతికూల వాతావరణం కార్పొరేట్‌ సంస్థలను దివాల అంచులకు నెడుతోంది. పలు సంస్థల మార్కెట్‌ క్యాపిటల్‌ వాటి అప్పులను మించిపోయింది. గత ఐదేళ్లలో ఇటువంటి పరిస్థితి నెలకొనడం ఇదే తొలిసారి. 2018 చివరి నాటికి ఇటువంటి సంస్థల సంఖ్య [news_tags_keywords] => bse,nse,stock market [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 10:36:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రమాదంలో రూ.13లక్షల కోట్లు..! - 195 firms owe Rs 13 trillion to lenders borrowings exceed market cap - EENADU
close

తాజా వార్తలు

ప్రమాదంలో రూ.13లక్షల కోట్లు..!

 195 కంపెనీలకు మూలధన విలువ కంటే అప్పులు అధికం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల స్టాక్‌ మార్కెట్లో చోటుచేసుకొన్న ప్రతికూల వాతావరణం కార్పొరేట్‌ సంస్థలను దివాల అంచులకు నెడుతోంది. పలు సంస్థల అప్పులు మార్కెట్‌ క్యాపిటల్‌ ను మించిపోయాయి. గత ఐదేళ్లలో ఇటువంటి పరిస్థితి నెలకొనడం ఇదే తొలిసారి. 2018 చివరి నాటికి ఇటువంటి సంస్థల సంఖ్య 99 ఉండగా.. 2019 మార్చి నాటికి అది 147కు చేరింది. బ్యాంకుల కార్పొరేట్‌ రుణాల్లో సింహభాగం ఈ సంస్థలకు ఇచ్చినవే కావడం గమనార్హం. ఇప్పుడు వీటి సంఖ్య 195కు చేరినట్లు సమాచారం. ఈ సంస్థలకు బ్యాంకులు దాదాపు రూ.13లక్షల కోట్లు రుణాలను మంజూరు చేశాయి. 2018 మార్చితో ముగిసిన ఐదేళ్లలో వీటికి ఇచ్చిన రుణాలు 47.5శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

హేమాహేమీ కంపెనీలు..

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌.. రుణాలు నిష్పత్తి ఎక్కువగా ఉన్న సంస్థల జాబితాలో హేమాహేమీ సంస్థలు ఉన్నాయి. వొడాఫోన్‌ ఐడియా(15.1), టాటా మోటార్స్‌(32.7), టాటా పవర్స్‌(30.4),టాటా స్టీల్‌ (38.5), జీఎంఆర్‌ ఇన్ఫ్రా(37.7), ఆర్‌బీఐ ఇన్ఫ్రా(17.5), సద్భావ్‌ ఇంజినీరింగ్‌(18.1) అదానీ పవర్‌(48.1), జిందాల్‌ స్టీల్‌(30), రతన్‌ ఇండియా పవర్‌(2.7) వంటి సంస్థలు ఉన్నాయి. రుణాలకు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌కు మధ్య ఉన్న ఈ అంతరం సంస్థలను ఆర్థిక కష్టాల్లో పడేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. సరికొత్తగా మార్కెట్‌ క్యాపిటల్‌ను (మూలధనాన్ని)సమీకరించడం కూడా కష్టమవుతుంది. వీటి ప్రస్తుత మూలధన విలువ ఆధారంగానే కొత్తనిధులను సమకూర్చుకొనే శక్తి లభిస్తుంది. ఆర్థిక సామర్థ్యాలు దెబ్బతినడంతో వీటికి నగదు అవసరాలు పెరిగిపోతాయి. అంతేకాదు.. పడిపోతున్న మార్కెట్‌ విలువ ఆర్థిక అవసరాలను తీర్చే మార్గాలను కూడా మూసేస్తుంది. 
మరోపక్క ప్రపంచ ఆర్థిక మందగమనం కొనసాగితే ఇప్పట్లో మార్కెట్లు కోలుకోవు. దీంతో వీటికి మార్కెట్‌ విలువ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. వ్యవస్థలో వ్యాపారం తగ్గి నగదు లభ్యత కూడా మందగించే అవకాశాలు ఉన్నాయి. 2012, 2013లో మార్కెట్‌ పతనంతోనే ఇప్పుడు దివాల తీసిన కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను దెబ్బతీసింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.