close

తాజా వార్తలు

ఈ ఏడాదిలోనే హ్యుందాయ్‌ బీఎస్‌-6 వాహనాలు

ఉదయ్‌పూర్‌: దక్షిణకొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ బీఎస్‌-6లోకి మార్చిన మోడళ్లను ఈ  ఏడాది చివర్లో మొదలు పెడుతుందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో మార్చి చివరి వరకు  బీఎస్‌-4 వాహనాల విక్రయాన్ని కూడా కొనసాగిస్తామని పేర్కొంది. 
ప్రస్తుతం  హ్యుందాయ్‌ గ్రాండ్‌ఐ10 నియోస్‌ మోడల్‌మాత్రమే బీఎస్‌-6 మోడల్‌ అందుబాటులో ఉంది.  దీనిలో కూడా పెట్రోల్‌ వేరింయట్‌ మాత్రమే లభిస్తోంది. మరోపక్క మారుతీసుజుకీ కి చెందిన ఏడు  పెట్రోల్‌ కార్లు బీఎస్‌-6 నిబంధనల ప్రకారం అందుబాటులో ఉన్నాయి. 

‘‘ఈ  ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది మొదట్లో  కానీ  మా బీఎస్‌-6 మోడల్‌ వాహనాలు మార్కెట్లోకి వస్తాయి. క్రమ పద్దతిలో బీఎస్‌-6 వాహనాలను మార్కెట్లోకి తెస్తామన్నారు. ప్రణాళిక ప్రకారం అన్ని మోడళ్లను బీఎస్‌-6లోకి అప్‌గ్రేడ్‌చేస్తాము. మరోపక్క ధరలు కస్టమర్లకు అందుబాటులో ఉండేలా చూస్తాము. ’’ అని హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ఎండీ, సీఈవో ఎస్‌ఎస్‌   కిమ్‌ పీటీఐకు వెల్లడించారు.  


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.