close

తాజా వార్తలు

కార్ల సర్వీస్‌ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

ఎంవీపీ కాలనీ: విశాఖలోని కార్ల సర్వీసు కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖ నగరంలోని ఎంవీపీకాలనీ డబుల్‌రోడ్డు చివరన హుందాయ్‌ కంపెనీకి చెందిన మ్యాంగో హుందాయ్‌ కార్ల సర్వీస్‌ కేంద్రంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం ఏడు గంటలకే షోరూమ్‌ సిబ్బంది అంతా వెళ్లిపోయారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో లోపల నుంచి పొగలు రావడం గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే షోరూమ్‌ షట్టర్‌ను తెరిచేందుకు ప్రయత్నించారు. అప్పటికే  కేంద్రంలో మంటల వ్యాపించి ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో లోపల ఉన్న నాలుగు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా అన్ని కార్లకు నిప్పు అంటుకోవటంతో మంటలు ఆర్పేందుకు ఎక్కువ సమయం పట్టింది. సంఘటనా స్థలం వద్దకు పెద్ద ఎత్తున స్థానికులు చేరుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
dr madhu
VITEEE 2020
Saket Pranamam
besttaxfiler
tsmbanner

Panch Pataka

దేవతార్చన